యువ కథానాయకుడు నాగచైతన్య రీమేక్‌లపై మోజు చూపిస్తున్నాడు. తాడాఖాతో రీమేక్ హిట్ కొట్టిన చైతూ.. ఇప్పుడు మళయాల ప్రేమమ్‌ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి తమిళ సినిమాపై దృష్టి పెట్టాడట. ఈవారం తమిళంలో విడుదలైన చిత్రం.. మొట్రో. ఈ సినిమాకి మంచి వసూళ్లు దక్కాయి. క్రిటికల్‌గా కూడా అక్లైమ్ వచ్చింది. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఇప్పుడు తెలుగు నిర్మాతల్ని ఆకట్టుకొంటోంది. ఈ సినిమాపై చైతూ దృష్టి పడిందట. ఓ నిర్మాతని తెలుగు రైట్స్ తీసుకోమని పురామాయించినట్టు తెలుస్తోంది. మెట్రో కోసం తెలుగు నుంచి నలుగురైదుగురు నిర్మాతలు అప్పుడే కర్చీఫ్ వేసినట్టు సమాచారం. మరి… ఈ రైట్స్ ఎవరికి దక్కుతాయో చూడాలి.
మెట్రో హీరో ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కాదు. మాస్ అంశాలూ తక్కువే. మరి అలాంటి కథని చైతూ ఎందుకు ఇష్టపడుతున్నాడో. నేటి తరం హీరోలంతా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలపై దృష్టి పెడుతున్నారు. బహుశా.. చైతూ కూడా అదే దారి పట్టాడేమో మరి. ప్రేమమ్ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. జులైలో పాటల్ని, ఆగస్టులో ఈ చిత్రాన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.