`లక్ష్మీస్ ఎన్టీఆర్`… ఈ టైటిల్ ఈమధ్య వినిపించలేదు. ఎందుకంటే.. `ఎన్టీఆర్` బయోపిక్ ప్రకటించిన వెంటనే ఎంత హడావుడిగా `లక్ష్మీస్ ఎన్టీఆర్` ప్రకటించాడో, అంతే తొందరగా ఆ సినిమా గురించి మర్చిపోయాడు. వర్మ ఫామ్ లో లేకపోవడం వల్లో ఏమో…. ఇంతటి సన్సేషనల్ ప్రాజెక్టుకు కూడా ఏమాత్రం హైప్ రాకుండా పోయింది. `లక్ష్మీస్ ఎన్టీఆర్` ప్రాజెక్టుని ఆపేయాలని వర్మని కొంతమంది టీడీపీ నేతలు బెదిరించినట్టు తెలిసింది. ఎన్టీఆర్ వారసులలోనే ఓ కీలకమైన వ్యక్తి… వర్మని ముంబైలో కలసి `ఈ సినిమా చేయొద్దు` అన్నార్ట. దాంతో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టేశారని వార్తలు వినిపించాయి. దాన్ని నిజం చేస్తూ… చాలా కాలం నుంచి వర్మ కూడా ఈ సినిమా ఊసెత్తలేదు. ఇప్పుడు సడన్‌గా `ఎన్టీఆర్` బయోపిక్‌ని రంగంలోకి దించాడు. జనవరిలో షూటింగ్ పూర్తి చేస్తానని క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఇదంతా చూస్తుంటే.. వర్మ మరోసారి ఈ బయోపిక్‌ని వాడుకుంటూ… పబ్లిసిటీ స్టంట్ మొదలెట్టాడా? లేదంటే నిజంగానే ఈ సినిమా మొదలెట్టేస్తాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. `ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని.. వర్మ ఈ సినిమా తీసే ఛాన్స్ లేదని` నందమూరి కాంపౌండ్ వర్గాలు అంటున్నాయి. నిజంగా `లక్ష్మీస్ ఎన్టీఆర్` గనుక తీస్తే… వర్మ బెదిరింపులపై వచ్చిన వార్తలేవీ నిజం కానట్టే. ముంబై మాఫియా బెదిరింపులకే లొంగని వర్మ… టీడీపీ నేతలకు లొంగుతాడా??