టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ వార్తల్లో నిలిచింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… నేచురల్ స్టార్ నాని కాంబోలో ఓ సినిమా రాబోతోందట. వినడానికి ఈ వార్త బాగానే ఉంది. నాని, పూరి… కలిస్తే అంచనాలు పెరుగుతాయి. కానీ… వీరిద్దరి కాంబో సెట్టవుతుందా, మ్యాచ్ అవుతుందా? అనేదే డౌటు. నానిది పూర్తిగా `పక్కా లోకల్` టైపు క్యారెక్టర్లు. పెద్దగా హీరోయిజం చూపించకుండానే.. కనికట్టు చేస్తుంటాడు. పక్కింటి అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలనుకుంటారో, నాని అలానే కనిపిస్తాడు. సెన్సాఫ్ హ్యూమర్, కాస్త అమాయకత్వం, తెలియని మేధావితనం ఇవన్నీ నాని పాత్రల్లో కనిపించాల్సిందే. పూరి స్టైల్ వేరు. తానెప్పుడూ కొడితే మైండ్ బ్లాంక్ అయిపోయే క్యారెక్టర్లు రాసుకుంటుంటాడు. హీరో ఎవరైనా సరే – పూరిలా మారిపోవాల్సిందే. అలాంటి క్యారెక్టర్లు నాని ఎప్పుడూ చేయలేదు. అడపా దడపా మాస్ ట్రై చేసినా వర్కువట్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూరి – నాని కాంబో… కచ్చితంగా మిస్ మ్యాచ్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. రాజమౌళి `ఈగ` మినహాయిస్తే.. పెద్ద దర్శకులెవరితోనూ పనిచేయలేదు నాని. అందులోనూ అతిథి పాత్ర లాంటిదే అనుకోవాలి. కొత్త దర్శకులు, కొత్త పాయింట్లతో ప్రయాణం చేస్తున్నాడు. అవే విజయాల్నీ అందిస్తున్నాయి. మరోవైపు పూరి ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాని రిస్కు తీసుకుంటాడా అనేది డౌటే. పేపర్ పై చూస్తుంటే క్రేజీగా అనిపించే ఈ కాంబో.. సెట్టవ్వాలంటే చాలా సమీకరణాల్ని దాటుకుంటూ రావాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.