చిత్ర సీమలో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు, చేసిన ప్రమాణాల కంటే… విజయాలకే ఎక్కువ ప్రాధాన్యం. చేతిలో హిట్ ఉన్నప్పుడు `మనం సినిమా చేద్దాం` అంటూ వెంటపడినవాళ్లే… ఫ్లాపులు ఎదురైతే `తరవాత చూద్దాంలే` అని తప్పించుకొంటారు. అందులో తప్పుపట్టడానికి కూడా ఏం లేదు. సినిమా అనేది డబ్బులతో, ఇమేజ్‌తో ఆడే ఆట. ఎవరి జాగ్రత్తలలో వాళ్లుండడమే మంచిదే. ఇచ్చిన మాట కోసమో, ఫ్రెండ్ షిప్ కోసమో సినిమా చేయాల్సివస్తే ఇరకాటంలో పడినట్టే. ప్రస్తుతం నాని అలాంటి సంకట స్థితిలోనే ఉన్నాడు.
హను రాఘవపూడి – నాని కాంబినేషన్లో ‘కృష్ణగారి వీర ప్రేమ గాధ’ విడుదలైంది. అది బాగానే ఆడింది. ఆ సమయంలోనే ‘మనం మళ్లీ మరో సినిమా చేద్దాం’ అని మాటిచ్చేశాడు నాని. హను కూడా ఓ కథ రెడీ చేసుకొన్నాడు. 2018 ప్రధమార్థంలో ఆ సినిమా పట్టాలెక్కాలి. అయితే ‘లై’ రిజల్ట్ ఈ సినిమాపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. లై ఎఫెక్ట్ నానినే కాదు, ఏ హీరో అయినా హనుతో సినిమా అంటే కాస్త ఆలోచించుకోవాల్సిందే. నానినీ… హను ఇబ్బంది పెట్టలేడు. ఈలోగా హను ఓ సినిమా చేసి.. అందులో మళ్లీ తనని తాను నిరూపించుకొంటే తప్ప.. హను – నానిల కాంబో పట్టాలెక్కడం కష్టమే. మరి హనుని నమ్మి సినిమా చేసే ఆ హీరో దొరకాలిగా!!