ఈ మధ్య మన జనాలు అందరూ కొరియన్ ఫిల్మ్ ల మీద కాస్త గట్టిగానే డిపెండ్ అవుతున్నారు. అక్కడి సినిమాల్లోని పాయింట్లు పీక్కు వస్తున్నారు. ఆపైన వాటిని మన నేటివిటీ, మన క్రియేటివిటీ కలిపి, కొత్త కథ అల్లుతున్నారు. యాంగర్ మేనేజ్ మెంట్, ప్రేమించిన వారిని మరచిపోవడం, అవయువాల లోపాలు,, ఇలా రకరకాల సబ్జెక్ట్ లు అక్కడ నుంచి పట్టుకుని వస్తున్నారు. ఎవరి ఊహాశక్తికి తగినట్లు వారు కథ అల్లుకుంటున్నారు.
లేటెస్ట్ గా రాబోతున్న సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువంటే’ సినిమాకు కూడా ఇలాగే ఓ కొరియన్ ఫిల్మ్ నుంచి లైన్ తెచ్చినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. పక్కా యారోగెంట్ గా వుండే బాస్ చుట్టూ అల్లిన ప్రేమకథ లాంటిది ఏదో వుందట. ది యారోగెంట్ లవ్ స్టోరీ అని అనుకోవాలేమో? అలాంటి లైన్ ను తీసుకువచ్చి, కథ అల్లినట్లు తెలుస్తోంది.
పక్కా పరమ స్ట్రిక్ట్ గా వుండడం, ఎవ్వరి మాటా వినకపోవడం, కింద పనిచేసే సిబ్బందికి రకరకాల పనిష్ మెంట్ లు ఇవ్వడం చేసే ‘రాక్షస’ బాస్ ప్రేమలో పడితే..అన్న లైన్ లో కథ తయారుచేసుకున్నట్లు తెలుస్తోంది. లైన్ అయితే వైవధ్యంగానే వుంది. ఎక్కడ నుంచి ఎలా తెచ్చి డెవలప్ చేసినా, హిట్ పడితే చాలు. హీరోకి, ఇండస్ట్రీకి మంచిదే.