త్రిష కథానాయికగా ఎంట్రీ ఇచ్చి పుష్కరం దాటేసింది. అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఉంది. ఆమెలో గ్లామర్ అణువంత కూడా తగ్గలేదు. కాకపోతే.. క్రేజ్ ఎప్పట్లా ఉండదు కదా? టాలీవుడ్లో త్రిష ఇప్పుడు ఓ వెటరన్ హీరోయిన్ అయిపోయింది. తమిళంలో అడపాదడపా సినిమాలొస్తున్నా.. అందులో బాక్సాఫీసు విజయాల్లేవు. ఇప్పుడు చేతిలో నాయికి సినిమా ఒక్కటే ఉంది. త్రిష చేస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్సినిమా ఇది. దీని ఫలితంపై కూడా ఎవ్వరినీ నమ్మకాల్లేవు.
అందుకే నాయకి తరవాత.. సినిమాలకు దూరమవ్వాలని త్రిష నిర్ణయించుకొన్నట్టు టాక్. తెలుగు, తమిళం నుంచి సరైన అవకాశాలు రాకపోవడం, వయసు పై పడడంతో.. త్రిష ఈ నిర్ణయానికి వచ్చిందట. అసలు గత ఏడాదే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవ్వాలనుకొంది. అయితే… ఆమె కల కలగానే మిగిలిపోయింది.కాబోయే వాడు హ్యాండ్ ఇవ్వడంతో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పుడు ఇక్కడా కలసి రావడం లేదు. అందుకే సినిమాలకు స్వస్తి చెబుదామనుకొంటోందట. నాయకి సినిమా ఒకవేళ ఊహించని విజయం సాధించి, ఊపిరి సలపని అవకాశాలొస్తే మాత్రం త్రిష తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. అయితే.. నాయకి కి అంత సినిమా లేదని టాక్. సో… త్రిషని ఇక ఎంతో కాలం వెండితెరపై చూళ్లేమన్నమాట.