ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ… నీలం సహానీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని.. ఆమె.. మళ్లీ ఢిల్లీ సర్వీసులకు వెళ్లాలనే చేస్తున్నారన్న ప్రచారం అధికారవర్గాలలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఎక్కువ కాలం కేంద్ర సర్వీసుల్లో ఉన్న రిటైర్మెంట్ కు ముందు.. చీఫ్ సెక్రటరీగా పని చేశానన్న సర్వీస్ రికార్డు కోసమే… ఏపీకి వచ్చానని… చెబుతూ ఉంటారు. అయితే.. చీఫ్ సెక్రటరీగా ఆమెను ప్రభుత్వం… చట్ట వ్యతిరేక పనుల కోసం ఉపయోగించుకుంటోందన్న అభిప్రాయం తరచూ ఏర్పడుతోంది. దీనికి కారణం… సీఎస్ కు ఇటీవలి కాలంలో కోర్టుల నుంచి హెచ్చరికలు రావడమే. అధికారుల పరంగా ఏ తప్పు జరిగినా.. దానికి సీఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఆమె వారందరికీ బాస్.
రాజధాని తరలింపు విషయంలో.. అలాగే ఇంగ్లిష్ మీడియంలో విషయంలో ..హైకోర్టు… స్పషమైన హెచ్చరికలు ప్రభుత్వానికి చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. అధికారుల వ్యక్తిగత ఖాతాల నుంచి ఖర్చులు వెనక్కి తెప్పిస్తామని అలాగే… సీబీఐ, ఏసీబీలతో విచారణ జరిపిస్తామని కూడా స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం.. వెనక్కి తగ్గాలనుకోవడం లేదు. జీవోలు విడుదల చేయిస్తోంది. చేస్తేనే పోస్టుల్లో ఉంటారు.. లేకపోతే ఊస్టింగ్ అన్న భావన తెచ్చేయడంతో.. ఏం జరుగుతుందో తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో.. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ లో.. సీఎస్ కు వ్యతిరేకంగా రికార్డు నమోదయింది. జాస్తి కృష్ణకిషోర్ విషయంలో తమ ఆదేశాలు పాటించలేదన్న కారణంగా… ఆమెను పిలిపించి వివరణ తీసుకుంటామని… హెచ్చరించింది. అప్పటికప్పుడు.. ఆయనకు జీతం చెల్లించేసినా… నీలం సహాని పై వ్యతిరేకంగా ఓ రిమార్క్ పడినట్లయింది. వివరణ కూడా పంపాల్సిన అవసరం ఏర్పడింది.
తన కెరీర్ లో ఇంత వరకూ… ఎలాంటి వివాదాస్ప నిర్ణయాలు తీసుకోలేదని… క్యాట్ కు … కోర్టులకు వెళ్లాల్సిన అవసరం రాలేదని.. కానీ ఏపీకిలో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన తరవాత తనపై అన్ని రకాల రిమార్కులు పడుతున్నాయని… నీలం సహాని ఆవేదన చెందుతున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. నిజానికి నీలం సహాని సీఎస్ నే కానీ… చేయాల్సిన పనులన్నీ… ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరైన అధికారి ప్రవీణ్ ప్రకాషే చేస్తూంటారు. కేవలం తన పేరు ఉపయోగించుకుని కోర్టుల్ని ధిక్కరించడం చేసి.. తనను ఇరికిస్తున్నారన్న అభిప్రాయం సీఎస్‌లో ఉందంటున్నారు. అందుకే… ఇరుక్కుపోక ముందే.. సైడవడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.