కొన్నాళ్ల క్రితం.. భారతీయ జనతా పార్టీ ఓ అంతర్గత సర్వే చేయించుకుంది. అందులో 150 సీట్లు కోత పడుతుందని తేలింది. ఈ సర్వే విషయం బయటకు వచ్చింది. బీజేపీ ఖండించలేదు. అలాగని అంగీకరించలేదు. కిక్కురుమనకుండా ఉంది. ఆ సర్వే ఆధారంగా.. ఎక్కడెక్కడ సీట్లు సంపాదించుకోవచ్చో.. కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు.. కొన్ని ఉత్తరాది మీడియా సంస్థలు ఫ్యాష్ సర్వేలు, రేటింగులు, అభిప్రాయసేకరణల పేరుతో.. వారానికో సర్వే ప్రకటిస్తోంది. అందులో బీజేపీకి ఆదరణ తగ్గింది కానీ… అధికారంలోకి వస్తుందని.. చెప్పుకొస్తున్నారు. అలా చెప్పకపోతే… సర్వేలు వేయరని లాజిక్ అందరికీ తెలుసు కాబట్టి.. ఆ సర్వేలను ఏ రాజకీయ పార్టీ సీరియస్గా తీసుకోవడం లేదు.
విచిత్రం ఏమింటే.. ఆసర్వేలు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ముఖ్యంగా.. ఏపీలోనూ.. స్పష్టమైన ఫలితాన్ని ప్రకటిస్తాయి. మొన్నామధ్య కేసీఆర్ …కోల్కతా వెళ్లి మమతా బెనర్జీని కలిస్తే.. ఆంధ్ర సీఎం… బెంగాల్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారని గంటల కొద్ది బ్రేకింగులు నడిపిన చానల్ కొన్నాళ్ల కిందట… ఓ సర్వే ప్రకటించింది. అందులో బీజేపీకి పన్నెండు శాతం ఓట్ల వరకూ వేశారు. ఆ తర్వాత నిన్నటికి నిన్న ఆర్నాబ్ గోస్వామికి చెందిన చానల్ కూడా.. ఓ సర్వే ప్రకటించింది. ఇందులో బీజేపీ గెలవకపోతే… ప్రపంచ వింత అవుతుంది. అలాగే.. ఏపీలో… బీజేపీకి పన్నెండున్నర శాతం ఓట్లు వేసుకున్నారు. మైనస్ ఓట్లు ఉంటే.. బీజేపీకి అవే పడతాయి కానీ.. ప్లస్ ఓట్లు ఎక్కడ వస్తాయని చాలా మందికి సందేహం.
అసలు ఈ సర్వేలు ఎందుకు ప్రకటిస్తున్నారనే సందేహం కూడా చాలా మందికి ఉంది. కానీ బీజేపీ నేతలు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ చెప్పే సమాధానం ఏమిటంటే.. పొత్తుల కోసమట. తమకు పన్నెండు శాతం ఓటు బ్యాంక్ ఉంది. పొత్తులు పెట్టుకుంటే కలిసొస్తాయని.. ఇతర పార్టీలకు ధైర్యం చెప్పడానికి…టెంప్ట్ చేయడానికట. వీటినే కదా.. మరీ చపాతీ తెలివి తేటలు అనేది. ఉత్తరాదిలో సర్వే చేసి దక్షిణాదిలో ఫలితాలు ప్రకటిస్తే.. పొత్తుల కోసం.. వచ్చేస్తారా..? రహస్య మిత్రులకు ఉన్నా.. టీఆర్ఎస్, వైసీపీ కూడా.. బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు. అయినా.. ఈ వింత కసరత్తులు ఎందుకో మరి..!