తెలంగాణ ఎన్నికలకు ముందు హడావుడి చేసిన క్యారెక్టర్లలో ఒకటి పరిపూర్ణానంద. కత్తి మషేష్ అనే వ్యక్తి రాముడిపై చేసిన కామెంట్లతో… రాజకీయంగా తనను తాను మల్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు బీజేపీలో చేరడతంతో ముగిశాయి. యోగీ ఆదిత్యనాథ్ తో పోలిస్తే.. తనకేం తక్కువ అని అనుకున్నారేమో కానీ.. బీజేపీ లో చేరిన వెంటనే… అందరి కంటే తానే ఉన్నతం అన్నట్లు వ్యవహరించడం ప్రారంభించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పక్కనే కుర్చీ వేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే లాంటి వాళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో 30 రోజుల్లో బీజేపీకి 70 సీట్లు సాధించి పెడతానని సవాల్ చేశారు. ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. బీజేపీకి 70కంటే ఎక్కువగా వంద సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి.
ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తానని… అదీ కూడా.. 30 రోజుల్లోనే అని … అమిత్ షాకు మాటిచ్చాని.. కొత్తగా ఆధ్యాత్మికం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన. .. పరిపూర్ణానంద పదే పదే చెప్పుకొచ్చారు. పరిపూర్ణానంద కాన్ఫిడెన్స్ చూసి బీజేపీ నేతలు బిత్తర పోయారు. తానే నెక్ట్స్ సీఎం అన్నంతగా.. ఆయన హడావుడి చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినంత కాలం.. పరిపూర్ణానంద విస్తృతంగా పర్యటించారు. కానీ పెరిగిందేమీ లేదు కానీ.. ఘోరంగా కోత పడిపోయింది. అసలు పార్టీ ఉందా అన్న పరిస్థితికి వచ్చేసింది.
ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో హిందూత్వ రాజకీయాలకు ఎక్కువ స్కోప్ ఉంది. ముస్లిం జనాభా గణనీయంగా ఉండటమే కాదు.. ఆరెస్సెస్ లాంటి హిందూ సంస్థలు కొన్ని… కింది స్థాయి నుంచి బలంగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాయి. దాంతో.. తెలంగాణలో బీజేపీకి ఎంతో కొంత స్కోప్ ఉందని.. ఆ పార్టీ అగ్రనాయకత్వం కూడా.. ఆశపడింది. కానీ దక్షిణాది ప్రజలు… బీజేపీ అనుకున్నంత అమాయకులు కాదని తేల్చేశారు. ఇప్పుడు పరిపూర్ణానంద ఏమీ మాట్లాడటం లేదు. మళ్లీ తన చానల్ భారత్ టుడే లో ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పుకుంటారేమో..?.