జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన రాజకీయ కార్యక్రమాలను సినిమా ఈవెంట్లలా నిర్వహిస్తున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఆయన ప్రజాపోరాటయాత్ర.. సినిమా సక్సెస్ టూర్లా సాగుతుందని.. ఇప్పటికీ సైటెర్లు పడుతూనేఉంటాయి. తాజాగా.. ఈ నెల పదిహేనో తేదీన ఆయన తలపెట్టిన… కవాతు కార్యక్రమం కూడా.. అచ్చంగా.. సినిమా ఈవెంట్లానే నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సినీ సంగీత దర్శకుడు.. తమన్‌తో ఓ పాటను కంపోజ్ చేయించారు. రామజోగయ్య శాస్త్రితో పాటను రాయించారు. ఈ పాటను.. కంపోజ్ చేస్తూ.. పాడుతున్న వీడియోను.. ఆన్లైన్ లో రిలీజ్ చేసి.. టీజర్‌గా హంగామా చేశారు. పూర్తి పాట.. ఇవ్వాళో రేపో రిలీజ్ చేస్తారు.
కవాతును .. ఓ భారీ ఈవెంట్‌లా నిర్వహించడానికి ఇప్పటికే… హైదరాబాద్ కు చెందిన ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. డ్రోన్ కెమెరాలతో.. కనీసం… ఇరవై, ముఫ్పై కెమెరాలతో… కవాతును షూట్ చేయబోతున్నారు. ఈ కవాతు ఎందుకంటే… పవన్ కళ్యాణ్ ఈ నెల 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నందుకు. పశ్చిమగోదావరి జిల్లాలో పోరాటయాత్ర ముగియడంతో..ఆయన కవాతు చేసి… తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్తున్నారు. 15వ తేదీన ఆయన విజ్జేశవరం మీదుగా పిచ్చుకలంకకు కారులో చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు కార్యకర్తలతో కలిసి కవాతు ప్రారంభిస్తారు. ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా ఈ కవాతు సాగుతుంది. కాటన్ విగ్రహం వద్ద ఇది ముగుస్తుంది. ఆ తర్వాత బహిరంగ సభలో జనసేనాని మాట్లాడుతారు. బహిరంగ సభలో పాల్గొనే నేతలు, కార్యకర్తల వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు గోదావరి జిల్లాల నుంచి వచ్చే వారి కోసం 10 ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి కూడా ఫ్యాన్స్ రావాలని పిలుపునిచ్చారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పాదయాత్రలో వంతెనులు వచ్చినప్పుడు.. ఆ చివర నుంచి ఈ చివర వరకు జనాలతో నింపి దాన్ని డ్రోన్ కమెరాలతో బంధించి… జన ప్రవాహం అని ప్రచారం చేసుకుంటారు. కనకదుర్గమ్మ వారిధి, రాజమండ్రి రైల్ కం రోడ్ బ్రిడ్జిపైన ఇలాంటి… ప్రదర్శనలే చేశారు. ఇవి పవన్ కల్యాణ్ ను ఆకట్టుకున్నాయేమో కానీ.. అలాగే ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి .. తన సినిమా అనుభవాలతో టచింగ్ ఇస్తున్నారు. మొత్తానికి.. సినీ గ్లామర్‌తో కవాతుకు కొత్త ఆకర్షణ తెస్తున్నారన్నమాట..।
JanaSena Kavathu Teaser#JSPForPoliticalAccountability pic.twitter.com/VGIpVjTqzX
— JanaSena Party (@JanaSenaParty) October 14, 2018