ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే.. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు… భగ్గుమంటున్నాయి. ఎత్తులు, పైఎత్తులు, పొత్తులతో హాట్ హాట్ గా నడిచిపోతున్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ – మీడియామధ్య వార్ పై అందరి ఫోకస్ ఉంది. కానీ అంతర్గతంగా దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని.. అందే జగన్- పవన్ మధ్య రాజకీయ స్నేహం పెంపొందించడం అన్న అభిప్రాయాలు అంతటా వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన మధ్య ఉన్న బంధాన్ని మళ్లీ అతుక్కోకుండా విడగొట్టి..అదే సమయంలో… పవన్ ను.. టీడీపీ బారి నుంచి తానే కాపాడుతున్నాన్న భావన వచ్చేలా వైసీపీ చేస్తూ.. ఈ రెండు పార్టీల్ని రింగ్ మాస్టర్ లా బీజేపీ ఆడిస్తోందన్న అభిప్రాయం బలంగానే ప్రజలకు కలుగుతోంది.
భారతీయ జనతాపార్టీకి ఏపీలో కనీసం డిపాజిట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. కానీ ఆ పార్టీ నేతలు.. చంద్రబాబును మళ్లీ గెలవనీయబోమని చెబుతున్నారు. ఈ ప్రకటనల్లో అంతరార్థం.. ఒక్కేట..అదే వైసీపీ-జనసేన మధ్య పొత్తు. ఏపీలో రెడ్డి-కాపు సామాజికవర్గాలు కలిస్తే చంద్రబాబు ఓటమి అత్యంత తేలిక అని బీజేపీ కొత్త స్ట్రాటజిస్ట్ రామ్ మాథవ్ తేల్చారు. అందుకే తనకు ఏపీ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఆయన… వైసీపీ-జనసేన మధ్య పొత్తుకోసమే వ్యూహాలు రచిస్తున్నారట. అందులో భాగమే ప్రస్తుతం.. పవన్ కల్యాణ్ ట్విట్టర్ టెంపరట. తెలుగుదేశం పార్టీపై పవన్ కల్యాణ్ కు ఏ మాత్రం సాఫ్ట్ కార్నర్ ఉండకుండా.. పూర్తి స్థాయిలో దూరం చేసేందుకు… వ్యూహం ప్రకారమే.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు నడుస్తున్నాయని బీజేపీ వర్గాలు.. అంతర్గతంగా చెప్పుకుంటున్నాయి.
కానీ జగన్ – పవన్ కలవడం సాద్యమా..? అని రెండు పార్టీల నేతలు.. సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి… ఇద్దరి జుట్టూ బీజేపీ చేతిలో ఉందనేది బహిరంగరహిస్యమంటున్నారు. జగన్ ఇప్పుడు బీజేపీని కాదని.. ఒక్క అడుగు కూడా ముందుకు కూడా వేయలేని పరిస్థితి. ప్రత్యేకహోదా ఉద్యమంలో బాగంగా.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ముందుగా అమిత్ షా దగ్గరకు వెళ్తున్నారట. వారి ఆమోదంతోనే రాజీనామాలు, ఎంపీల దీక్షలు చేశారట. ఏపీలో బీజేపీకి ఎలాగూ డ్యామేజ్ జరిగింది కాబట్టి… తమ అధీనంలో ఉండే..వైసీపీ, జనసేనలతో వ్యవహారాలు నడిపించవచ్చనేది బీజేపీ ప్లానని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
అదే నిజమైతే.. తెలుగుదేశం పార్టీ.. కులాల ఈక్వేషన్ లో కొత్త సమీకరణలు వెదుక్కోవాల్సిందేన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ జగన్ – పవన్ కలవడం అసాద్యమని.. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్లు చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో అసాధ్యమైనదీ ఏదీ ఉండదని… అందరికీ తెలుసు. ఏం జరుగుతుందో.. లెటజ్ వెయిట్ అండ్ సీ..