పవన్ కల్యాణ్ – ఎస్.జె. సూర్య కాంబోలో ఓ సినిమా కొబ్బరికాయ్ కొట్టుకొని ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు నుంచి సూర్య తప్పుకోవడం డాలీ (గోపాల గోపాల ఫేమ్) వచ్చేయడం తెలిసిన విషయమే. ఇప్పుడుపవన్ సినిమాకి సంబంధించిన సరికొత్త అప్ డేట్ ఏంటంటే… ఈ సినిమాకి దర్శకుడే కాదు, కథ కూడా మారిపోయిందట. ఎస్.జె. సూర్యతో సినిమాకి సంబంధించి స్క్రిప్టు పనులన్నీ పూర్తయిన పిదప.. ఆయన ఈ ప్రాజెక్టు లోంచి డ్రాప్ అయ్యారు. సూర్య వెళ్లిపోయినా.. కథ మారదులే అనుకొన్నారంతా. అయితే.. డాలీ రావడంతో కథలో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గోపాల గోపాల సమయంలోనే డాలీతో ఓ సినిమా చేయబోతున్నా అని ప్రకటించాడు పవన్. దానికి గల కారణం.. అప్పటికే డాలీ.. పవన్‌కి ఓ కథ చెప్పి ఓకే అనిపించుకోవడమే. డాలీ దగ్గర పవన్‌కి సరిపడ కథ ఒకటుంది. సూర్య డ్రాప్ అవ్వడంతో పవన్‌కి డాలీ గుర్తొచ్చింది అందుకే. సూర్య రెడీ చేసిన స్క్రిప్టును మొత్తంగా పక్కన పెట్టి డాలీ కథతోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్దామనుకొంటున్నాడు పవన్. అయితే డాలీ స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్దం చేయడానికి ఎంత టైమ్ పడుతుందో తెలియడం లేదు. ఒకవేళ స్క్రిప్టు రెడీగా ఉంటే గనుక… కథ కూడా మారిపోవడం ఖాయం.