అవును, కమల్ హాసన్, కేజ్రీవాల్ కలిసారు. రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు. చెన్నై లో జరిగిన వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి ని కలిగించింది. ఆం ఆద్మీ పార్టీ వేదికగ ను తమిళనాడులో కమల్ కి అప్పగించాలనే ఉద్దేశ్యం కేజ్రీ కి ఉన్నట్టు తెలుస్తోంది. మరి, కమల్ హాసన్ దీన్ని అంగీకరించకపోవచ్చనీ, సొంత కుంపటిని ఆయన త్వరలోనే ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరిదీ బిజెపి వ్యతిరేక భావజాలం కావడం వల్ల, ఇద్దరూ కలిసి 2019 ఎన్నికలకి పనిచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇదే తరహా లో బిజెపి ని ఎండగడుతున్న పవన్ కళ్యాణ్ కూడా వీరికి జతకలుస్తాడా అనేదే ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న అంశం.
ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న కమల్ హాసన్ కేరళ సిఎం, కమ్యూనిస్ట్ పార్టీ కి చెందిన విజయన్ ని ఆల్రెడీ కలిసారు. తనది కమ్యూనిస్ట్ భావజాలమని స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే దీనికి చాలా ముందే పవన్ కమ్యూనిస్ట్ కూటమితోనే తాను ఉంటానని ప్రకటించేసారు. కాబట్టి ఈ లెక్కన కేజ్రీ, కమల్, లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇదే కూటమితో కలిసి 2019 ఎన్నికలకి వెళ్ళాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారి ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పవన్ ఈ కూటమికి బదులు బిజెపి తో వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి ఈరోజు కకపోయినా, మరి కొన్నాళ్ళకైనా, పవన్ కూడా ఈ కంబినేషన్ తో జతకట్టే అవకాశం ఉంది.
అక్టోబర్ నుంచి పూర్తి రాజకీయాల్లోకి వస్తానన్న పవన్ ఈ దిశగా ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నాడో, ఏమేమి కొత్త కొత్త కాంబినేషన్లకి తెరతీస్తాడో వేచి చూడాలి.