రాజధాని రైతులకు ఎలా అండగా ఉండాలన్నదానిపై.. జనసేన కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాజధానిని కాపాడటం కోసమే.. తన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని.. గతంలో పవన్ కల్యాణ్ .. దీక్షా శిబిరంలో రైతులకు చెప్పారు. ఆ తర్వాత ఆయన… రాజధాని రైతులకు మద్దతుగా భారీ పోరాటాలకు ప్రణాళికలు వేసినా… తర్వాత అటు బీజేపీ.. ఇటు జనసేన సైలెంటయిపోయాయి. చివరికి.. భారతీయ జనతా పార్టీ.. తాము అమరావతికి కట్టుబడి ఉన్నామని తీర్మానం చేసింది. అయితే.. అది రాష్ట్రానికి సంబంధించిన విషయమని.. కేంద్రం పట్టించుకోబోదని.. మరో వైపు చెప్పడంతో… వారిదంతా పొలిటికల్ గేమ్ అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వచ్చింది. దాంతో అందరి చూపు .. జనసేన వైపు పడింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్… బీజేపీతో పొత్తు పెట్టుకోనప్పుడు.. తన పార్టీ కార్యక్రమాలు తాను స్వచ్చంగా నిర్వహించుకునేవారు. కానీ.. హఠాత్తుగా.. ఢిల్లీ వెళ్లి… బీజేపీతో పొత్తు ప్రకటన చేశారు. సాధారణంగా ఎన్నికలు ఉన్నప్పుడే.. . ఎవరైనా పొత్తులు పెట్టుకుంటారు. కానీ పవన్ కల్యాణ్.. మాత్రం. జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించిన తర్వాత … ఆ వేడి ఉన్నప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. దీంతో ఆయన అమరావతిని కాపాడేందుకు బీజేపీ సాయం పొందేందుకు ఇలా చేశారన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. గతంలో తెలంగాణ ఉద్యమం పీక్స్‌లో ఉన్నప్పుడు.. ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాష్ట్ర విభజన చేయకుండా హామీపొంది చిరంజీవి అలా చేశారని అనుకున్నారు. ఎందుకంటే.. అప్పటికే పీఆర్పీ సమైక్యాంధ్ర నినాదం తీసుకుంది.
ఇప్పుడు అమరావతి విషయంలో.. పవన్ కల్యాణ్ కూడా… బీజేపీతో అలాంటి నిర్ణయమే తీసుకున్నా… మూడు రాజధానుల్ని మాత్రం బీజేపీ అడ్డుకోకపోగా… సహకరించిందని మాత్రం.. చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దీంతో పవన్ కల్యాణ్ ఇప్పుడో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఆయన బీజేపీని ధిక్కరించే పరిస్థితి లేదంటున్నారు. బీజేపీ విధానాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. బీజేపీతో పొత్తున గౌరవిస్తూనే.. రైతుల కోసం… జనసేన పోరాటం చేయాలనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. తాము కూడా రైతుల కోసం పోరాడతామని బీజేపీ అంటోంది. అయితే.. బీజేపీతో కలిసి పోరాడితే.. జనసేనది కూడా మోసమేనని ప్రజలు నమ్ముతారని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బీజేపీని దూరం పెట్టి అమరావతి రైతుల కోసం పోరాడాల్సిన పరిస్థితి… జనసేన ముందు ఉంది. పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది..!