డిప్యూటీ సీఎం… గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడవులు లాంటి కీలక శాఖలు. అంటే ప్రతిరోజు జనంతో మమేకం అయ్యే శాఖలే. ప్రతి రోజు అలుపెరగకుండా పర్యటిస్తూ, రివ్యూలు చేస్తూ, నిర్ణయాలు తీసుకునే శాఖలే.
బాధ్యతలు పెరిగాయి… పని కూడా పెరిగింది. మరి సినిమాల సంగతి?
ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపుల తర్వాత ఇప్పుడు ఇదే చర్చ జోరుగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు చేతిలో ఇప్పటికే సినిమాలున్నాయి. కొన్ని ఒప్పుకొని సెట్స్ పైకి వెళ్లాల్సిన సినిమాలున్నాయి. కానీ, ఇటు షూటింగ్స్ కి డేట్స్ అడ్జెట్స్ చేసి, పరిపాలనకు అవకాశం ఉంటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
పవన్ ఏరీకోరి ఈ శాఖలు తీసుకున్నారని… ఆయన జనంతో మమేకం అయ్యే శాఖలు కావాలని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, పవన్ అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని… సెట్స్ పై ఉన్న సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసి, కొత్త సినిమాలు ఒప్పుకోకపోవచ్చంటూ జనసేన వర్గాల సమాచారం. కానీ పవన్ స్క్రీన్ మీద కనపడక పోతే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా… పవన్ నటజీవితానికి పుల్ స్టాప్ పెట్టడానికి ఓకే చెప్తారా… ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.