అక్రమలావాదేవీలకు సంబంధించిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు వినియోగించేందుకు వీలు కల్పించే ఎపి చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది.ఇక దీన్ని ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ అటాచ్డ్ ఆస్తులపై ప్రయోగిస్తారని కథలు వస్తున్నాయి. కొంత మంది ఆ మేరకు డిమాండ్ చేస్తున్నారు కూడా. కాని వాస్తవం ఏమంటే ఈ చట్టం అంత వెనువెంటనే ఆయన ఆస్తులను అమ్మేయడానికి అవకాశమిచ్చేదిగా వుండదు. రకరకాల అవినీతి వ్యవహారాలు అక్రమాలలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఏళ్లతరబడి అంటుకోకుండా కొనసాగించడం వల్ల విశ్వసనీయత దెబ్బతింటుందనేది ఇక్కడ ప్రభుత్వ వాదన. అయితే అక్రమాస్తులుగా న్యాయస్థానాలు నిర్ధారించి తీర్పు చెప్పకుండా ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీన పర్చుకోవడం కుదరదు. ఈ విషయంలో సిబిఐ న్యాయస్థానాల్లో ఆలస్యం జరగుతుందని గనక ప్రత్యేక న్యాయస్థానాలు లేదా ధర్మాసనాలు ఏర్పాటు చేసి త్వరితంగా తేల్చాస్తామని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అయితే అలాటి ఏర్పాట్లకే చాలా సమయం అయిపోతుంది.తర్వాత విచారణజరగాలి.ఆస్తుల వారిగా లెక్క తేలాలి. ఒక వేళ ఇప్పటికే ఉన్న త న్యాయస్థానాల్లో వుంటే వాటి అభిప్రాయం తీసుకోవాలి. ఇవేమీ లేకుండా జగన్ ఆస్తుల అమ్మకం జరిగిపోతుందనుకోవడం పొరబాటే. కోర్టులపై గౌరవం వుంది గనకే వారం వారం హాజరవుతున్నానని చెప్పిన ఆయనకు తర్వాత హాజరునుంచి మినహాయింపు లభించింది. ఇతరులు కూడా ఒకరిద్దరు ఈ వారం వారం భారం తప్పించుకోగలిగారు. అయితే సాక్షి సంస్థ ప్రభుత్వ ఆధీనంలో వుంది గనక దాన్నిస్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి వున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్'(ఈడీ) స్వాధీనం అంటే అది తాత్కాలికమే.సాధారణ కోర్టులు లేదా ప్రభుత్వ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు తేల్చవలసి వుంటుంది.నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిఇన్నాళ్లయినా అంతకు ముందే తామే అనేక ఆరోపణలు చేసిన జగన్‌కు సంబంధించిన కీలక కుంభకోణాలేవీ బయిటపెట్టింది లేదు.దర్యాప్తు వేగవంతం చేస్తే మంచిదే