ఎట్టకేలకు `రాధే శ్యామ్` రిలీజ్డేట్ ఫిక్సయ్యింది. మార్చి 4న ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్రబృందం ఫిక్స్ అయ్యింది. అయితే… ఈ డేట్ అధికారికంగా ప్రకటించాల్సివుంది. మార్చి 4న థియేటర్లను లాక్ చేయమని డిస్టిబ్యూటర్లకు యూవీ సంస్థ సందేశం పంపింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న `ఆర్.ఆర్.ఆర్` రాబోతోంది. ఆర్.ఆర్.ఆర్ కంటే రెండు వారాల ముందే రాధే శ్యామ్ రావాలని ఫిక్సయ్యింది. దానికి తగ్గట్టుగానే మార్చి 4 రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. నాలుగైదు రోజుల్లో ఈ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటిస్తారు. ఫిబ్రవరిలో… ఒమైక్రాన్ తగ్గుమొహం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నార్త్ లో ఇప్పటి వరకూ నైట్ కర్ఫ్యూ రూపంలో ఇబ్బంది ఎదురవుతూ వస్తోంది. ఒక్కో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ నిబంధన తొలగిస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారం నాటికి పరిస్థితులు అన్నీ చక్కబడతాయన్నది నిర్మాతల నమ్మకం. నిజంగా పరిస్థితుల తలకిందులై, ఇంతకంటే ఘోరంగా ఉంటే… ఎవరూ ఏం చేయలేరు. ముందైతే…. ఓ డేట్ లాక్ చేసి, దానికి అనుగుణంగా పబ్లిసిటీ పనులు మొదలెట్టడమే చేయాల్సివుంది. అందులో భాగంగా… చిత్రబృందం ఓ అడుగు ముందుకు వేసింది. అయితే ఈ డేట్ ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారన్నది చూడాలి.