నిఖిల్ వచ్చిన కొత్తలో లవ్ స్టోరీలు ట్రై చేశాడు. మాస్ కథల్లోనూ కనిపించాడు. ఆ తరవాత మెల్లిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టోరీలకు షిఫ్ట్ అయిపోయాడు. క్రైమ్ కామెడీకి తనే కేరాఫ్ అడ్రస్స్ అయ్యాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అంతే! కెరీర్ ప్లానింగ్ విషయంలో రాజ్ తరుణ్ కూడా నిఖిల్‌ని ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. లవ్ స్టోరీలతో తన కెరీర్ ప్రారంభించిన రాజ్ తరుణ్ ఆ జోనర్లోహిట్లు కొట్టాడు. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 హిట్లు అవ్వడంతో లవర్ బోయ్‌గా మారిపోయాడు. ఇప్పుడు క్రైమ్ కామెడీ జోనర్పట్టాడు. అవును… త్వరలోనే రాజ్ తరుణ్ ఓ క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నాడు.
దొంగాటతో ఆకట్టుకొన్న దర్శకుడు వంశీ కృష్ణ. ఇప్పుడు నిఖిల్ కోసం ఓ కథ రాసుకొన్నాడట. అయితే నిఖిల్.. ‘నో’ చెప్పడంతో ఆ కథ రాజ్ తరుణ్ దగ్గరకు వెళ్లిందని సమాచారం. ఎప్పటి నుంచో ఇలాంటి జోనర్లో సినిమా చేయాలని ఎదురుచూస్తున్న నిఖిల్ వెంటనే ఈ సినిమాకి ఓకే చెప్పేశాడని టాక్. ఈ కథ కూడా కిడ్నాప్, డబ్బు.. ఈ వ్యవహారాల చుట్టూనే నడుస్తుందట. కథానాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి. నిఖిల్దారిలోనడుస్తున్న రాజ్ తరుణ్ కి నిఖిల్ `నో` అన్న కథే వెదుక్కొంటూ రావడం యాదృచ్ఛికమే మరి.