ఆర్.ఆర్.ఆర్ తరవాత.. మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలి రాజమౌళి. 2023లో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. మధ్యలో 10 నెలలు సమయం ఉంది. ఈలోగా ఓ ప్రయోగాత్మక సినిమా చేయాలన్నది రాజమౌళి ప్లాన్. అందుకు సంబంధించిన.. ఆయన దగ్గర ఓ వెరైటీ సబ్జెక్ట్ ఉందట. `ఈగ` టైపు ఎక్స్పర్మెంట్ ఇది. అయితే… ఈ సినిమాని తాను దర్శకత్వం వహించాలా, లేదంటే.. దగ్గరి వాళ్లకెవరికైనా అప్పగించి, వెనుక తానుండాలా? అనే విషయంపై రాజమౌళి మల్లగుల్లాలు పడుతున్నట్టు టాక్. ఓ కొత్త హీరోతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆ హీరో… ఓ సీనియర్ హీరో వారసుడని సమాచారం అందుతోంది. ఇప్పటికే రాజమౌళి దగ్గర ఈ స్క్రిప్టు ఉండడంతో.. సెట్స్‌పైకి వెళ్లడానికి పెద్దగా సమయం పట్టకపోవొచ్చు. సాధారణంగా రాజమౌళి సినిమాలో కనిపించే సింథిల్, కీరవాణి.. ఈ బ్యాచ్ ఎవరూ లేకుండానే ఈ సినిమా చేయాలన్నది ఓ ఆలోచన. ఒకవేళ రాజమౌళి గనుక తానే ఈ ప్రాజెక్టుని టేకప్ చేస్తే… అప్పుడు యధావిధిగా తన బ్యాచ్ మొత్తం ఉంటుంది. వేరొకరికి అప్పగిస్తే… కొత్త టీమ్ వస్తుంది. ఈ సినిమా తాను చేస్తే ఎలా ఉంటుంది? మరొకరికి అప్పగిస్తే ఎలా ఉంటుంది? అనే విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు టాక్. రాజమౌళి చేసినా, తెర వెనుక ఉండి నడిపించినా.. ఈ సినిమాకి భారీ బజ్ రావడం అయితే ఖాయం.