విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అంటే అందరికి ఇష్టం. సినిమాలో హీరోయిజం కి ధీటుగా తన యాక్టింగ్ తో విలనిజంకి కొత్త అర్ధాన్ని చెప్పాడు ప్రకాశ్ రాజ్. బాలచందర్ చెక్కిన అద్భుత శిల్పంలో ప్రకాశ్ రాజ్ ఒకడు. అయితే ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ కు రావు రమేష్ రూపంలో గండం ఎదురవుతుంది. ఏ సినిమాలోనైనా ప్రకాశ్ రాజ్ క్యారక్టర్ రాసుకుంటే రాజుగారిని కాటాక్ట్ అవ్వడానికి ముందే దర్శక నిర్మాతలు ఆ క్యారక్టర్ కు రావుగోపాల రావు తనయుడు రావు రమేష్ ని అడిగి చూస్తున్నారు.
ఒక విధంగా రావు రమేష్ దర్శక నిర్మాతల బడ్జెట్ పరిధిలో ఉండటం కూడా దీనికి ముఖ్య కారణం కావొచ్చు. ప్రకాశ్ తో సినిమా అంటే అతనికే రెమ్యునరేషన్ ఎక్కువ సమర్పించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు రావు రమేష్ బెస్ట్ ఆప్షన్ అయ్యాడు. సినిమాలో హీరో అనే మాటలెవైనా పట్టించుకుంటారో లేదో తెలియదు కాని రావు రమేష్ చెప్పే డైలాగులు మాత్రం ప్రేక్షకులు కంటస్థం చేస్తారు. డైలాగ్ రైటర్ ఎంత గొప్పగా రాసినా దానికి సరైన విధంగా ప్రెజెంట్ చేస్తేనే ఆడియెన్స్ కి అది టచ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రకాశ్ రాజ్ తెలుగు సినిమాలు చాలా తగ్గించాడు. ఇక ఇదే అదునుగా రావు రమేష్ వరుస సినిమాలతో కుమ్మేస్తున్నాడు.
మొన్నటి వరకు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన రావు రమేష్.. రీసెంట్ సినిమాల్లో విలన్ గా కూడా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన సుబ్రమణ్యంలో కూడా విలన్ గా ప్రాసలతో ఆడియెన్స్ ను అబ్బురపరిచాడు రావు రమేష్. ఈ లెక్కన చూస్తుంటే ప్రకాశ్ రాజ్ కు రావు రమేష్ ఎసరు పెట్టాడనే అనిపిస్తుంది. రీడర్స్ మీరేమంటారు..