ఢిల్లీలోని బీజేపీ సానుభూతి మీడియా… తెలుగు రాష్ట్రాల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తున్నాయి. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం అదేమీ లేదని చెబుతున్నారు. పొత్తు లేకపోతే బతకలేమని ఆయా పార్టీలు అనుకుంటున్నాయని తాము మాత్రం 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. జాతీయ మీడియాతో ఎక్కువగా మాట్లాడే జీవీఎల్ నరసింహారావు, సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు నేషల్ మీడియాకు అదే చెబుతున్నారు.
అయితే వీళ్లు టీడీపీనే ఎక్కువగా విమర్శిస్తున్నారు. అలాంటి వార్తలు రావడంలో టీడీపీ పాత్రే ఉందంటున్నారు. రిపబ్లిక్ టీవీలో టీడీపీ నేతలు చెబితే వార్తలు వేస్తారా అని ఎవరికైనా డౌట్ వస్తుంది. ఆ చానల్‌ను ఫాలో అయ్యే వాళ్లు చూస్తే.. జగన్‌కు సాక్షి ఎలాగో.. బీజేపీకి రిపబ్లిక్ టీవీ అలా అని ఎవరైనా చెబుతారు. అలాంటి చానల్లో … బీజేపీ పొత్తులపై ఇతర పార్టీలు మైండ్ గేమ్ ఆడటానికి చాన్స్ ఉంటుందా…లేకపోతే బీజేపీనే అలా ఆడుకునే చాన్స్ ఉందా అనేది ఆ నేతలకే తెలియాలి.
అయితే.. అసలు జనసేన గురించి ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం లేదు. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు. మరి జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేకపోతే.. పొత్తులు లేవా అన్నదానిపై వారేమీ మాట్లాడటం లేదు. తరచుగా జనసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేవాళ్లు. ఇప్పుడు జనసేన ప్రస్తావన తగ్గించి.. తామే అధికారంలోకి వస్తామన్నట్లుగా మాట్లాడుతున్నారు.