సీఎం రేవంత్ రెడ్డి రిస్క్ చేస్తున్నారా…? తెలంగాణ సెంటిమెంట్ ను పర్ఫెక్ట్ గా వాడుకునే బీఆర్ఎస్ కు స్వయంగా అస్త్రం ఇస్తున్నారా…? రేవంత్ సక్సెస్ అయితే కేసీఆర్ కు మరింత ఇబ్బందులు తప్పవా…?
అవును పొలిటికల్ సర్కిల్స్ ఇవే చర్చలు నడుస్తున్నాయి. ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ప్రయోగిస్తుంటారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి కేసీఆర్ ఎంత బాగా తెలంగాణ అస్త్రాన్ని ఉపయోగిస్తారో అందరూ చూసిందే. అంతేందుకు 2019 ఎన్నికల్లో అధికారంలో ఉండి కూడా కూటమిలో ఉన్న చంద్రబాబును చూపి ఆంధ్రా-తెలంగాణ సెంటిమెంట్ తో సక్సెస్ అయ్యారు.
అయితే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ చిహ్నంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర గేయాన్ని తీసుకొస్తున్నారు. పాటకు సంగీతం అందిస్తున్న కీరవాణి విషయంలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, చిహ్నం విషయంలో రేవంత్ వేస్తున్న అడుగులు చాలా రిస్క్ అన్న అభిప్రాయం ఉంది.
మార్పుల తర్వాత తెలంగాణ ఉద్యమకారుల్లో అసంతృప్తి రాకపోతే ఓకే. కానీ, వస్తే మాత్రం… అందిపుచ్చుకొని రాజకీయం చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే మార్పులు తాము ఒప్పుకోం అంటూ పంచాయితీకి కాలుదువ్వింది. కానీ కేసీఆర్ ఇంకా ఓపెన్ కాలేదు. కానీ, చిహ్నం అధికారికంగా బయటకు వచ్చాక ఏమాత్రం తేడా వచ్చిన కేసీఆర్ రెడీగా ఉంటారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎక్కడా కనపడటం లేదు. కానీ, జూన్ 2న కొత్త చిహ్నం రాబోతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేస్తున్న రిస్క్ కేసీఆర్ నెత్తిమీద పాలు పోస్తుందా? రేవంత్ తీసుకున్న నిర్ణయం అందరినీ సంతృప్తిపర్చేలా ఉంటే కేసీఆర్ కు సెంటిమెంట్ అనే అస్త్రమే లేకుండా చేస్తుందా? అన్నది చూడాలి.