కొన్ని సార్లు భలే చిత్రాలు జరుగుతుంటాయి. దానికి ఎవరినీ పాయింట్ చేయలేం కానీ, అలా జరిగిపోతాయి అంతే. ఎన్టీఆర్ అంతటి వాడు లక్ష్మీ పార్వతి దగ్గరకు వచ్చిన తరువాత అధికారంపోయి, కిందకు జారిపోయాడు. ఇన్నాళ్లుగా ఎవర్ని తన చిత్తానికి ఎన్ని మాటలు అనేసినా, ఎలా చేసినా నడిచిపోయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ పార్వతీస్ ఎన్టీఆర్ అని అనౌన్స్ చేయగానే అరెస్ట్ ఆదేశాలు వచ్చేసాయి.
వంగవీటి సినిమా విషయంలో తమ ఫ్యామిలీకి అన్యాయం జరిగిందంటూ, రంగా కుమారుడు తదితరులు కోర్టుకు వెళ్లారు. కేసు నడచి నడచి, ఇప్పుడు వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్ వరకు వచ్చింది. సరే, అరెస్ట్ సంగతి, మిగిలన వ్యవహారాల సంగతి అలా వుంచితే, వర్మ ఈ దెబ్బకి ఇక లక్ష్మీపార్వతీస్ ఎన్టీఆర్ ప్రాజెక్టును ముట్టుకోమన్నా ముట్టుకోడు. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే, వర్మ లాంటి వాళ్లకు సరైన దెబ్బ తగిలే వరకే అలా రెచ్చిపోతారు. వన్స్ తగిలితే, ఇక అంతే. అందువల్ల ఇక తెలుగదేశం పార్టీ, బాబుగారి, బాలయ్యకు ఎవరికీ నో ప్రోబ్లమ్