#RRR సినిమాకి రాజమౌళి ఏం పేరు పెడతాడు?? అనేది ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాకి పేరు పెట్టే బాధ్యత రాజమౌళి ప్రేక్షకులకు అప్పగించడం, వాళ్లు రకరకాల టైటిళ్లని వినిపించడం చూస్తూనే ఉన్నాం. అయితే వీటన్నింటిలోనూ `రఘుపతి రాఘవ రాజారాం` అనే పేరుకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. దీన్నే టైటిల్‌గా పెట్టుకుంటే.. ప్రతి భాషలోనూ కొత్త టైటిల్‌ని పెట్టే అవసరం ఉండదు. ప్రతీ చోటా.. ఈ టైటిల్ తోనే సినిమాని విడుదల చేయొచ్చు.
అయితే… రాజమౌళి బృందం ముందే ఓ టైటిల్‌ని అట్టి పెట్టుకున్నారని – కేవలం ప్రేక్షకుల ఇన్వాల్వ్మెంట్ కోసం, టైటిల్ పట్ల క్రేజ్ ఏర్పడడం కోసం రాజమౌళి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. చివరికి రాజమౌళి అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేసి – దాన్ని ప్రజల నుంచి వచ్చిన టైటిల్‌గా క్రియేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సో… ఇదంతా రాజమౌళి మార్కెట్ స్ట్రాటజీ అన్నమాట. ఒక్క తెలుగు టైటిలే కాదు.. మిగిలిన భాషల టైటిళ్లకు సంబంధించి కూడా రాజమౌళి బృందం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, ఒకొక్క భాషలో నిర్ఱయించిన టైటిళ్లన్నీ ఒకేసారి ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.