ముంబై నటి జెత్వానీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో సర్వీస్ ఉన్న తన భవిష్యత్ ప్రమాదంలో పడటంతో … ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పూసగుచ్చినట్లుగా జరిగినది అంతా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు కుట్ర నాటి సీఎంవో అయిన తాడేపల్లి ప్యాలెస్ లోనే జరిగిందని తేలింది. పీఎస్ఆర్ ఆంజనేయులు .. ముంబై టి జెత్వానీని ఎలా ఇరికించాలన్న ప్లాన్ ను… కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు సీఎం క్యాంప్ ఆఫీసులోనే వివరించారు. అక్కడే ప్లాన్ చేసి ఏర్పాట్లు కూడా చేసి పంపించారు.
మొత్తం కుట్ర సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. అయితే ఈ వ్యవహారంలో నాటి డీజీపీకి అసలు పాత్ర లేదని తేల్చడం ఇక్కడ అసలు విశేషం. నాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి కనీసం సమాచారం ఇవ్వకుండానే ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్ చేశారని తేలింది. దీంతో ఆయన సేఫ్ అయ్యారు. మరి పీఎస్ఆర్ ఆంజనేయలు సీఎం క్యాంప్ ఆఫీసులో ఎవరితో మాట్లాడిన తరవాత ఈ కుట్రను అమలు చేశారన్నది ఇప్పుడు బయటకు లాగాల్సి ఉంది. అది నేరుగా జగన్ ఇచ్చారా లేకపోతే.. సజ్జల ఇచ్చారా అన్నది కీలకమే. నిజానికి ఇక్కడ సజ్జలకు స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. ఉంటే గింటే జగన్ దే అయి ఉంటుంది. ఆయన సూచనల మేరకు అనధికారికంగా పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల ద్వారా పని పూర్తి చేయించారు.
ఇప్పుడు పీఎస్ఆర్ ఆంజనేయులపై కేసు పెట్టి అరెస్టు చేసి.. కస్టడీలోకి తీసుకుని వివరాలు రాబడితే.. అసలు సీఎంవోలో ఎవరి ఆదేశాలతో జెత్వానీని అరెస్టు చేసే కుట్రలకు పాల్పడ్డారో బయటకు వచ్చే అవకాశం ఉంది. అది కూడా సమయానుకూలంగా జరగనుంది. మొత్తంగా జెత్వానీ కేసుతో రాజకీయాలకు సంబంధం లేదు. కానీ.. అత్యంత కీలక వ్యక్తులక పాత్ర బయటపడబోతోందని అనుకోవచ్చు.