ప్రభుత్వం తరపున ఆయనే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి తరపున కూడా ఆయనే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రికి అవగాహన ఉందో లేదో కూడా ఆయనే చెబుతున్నారు. ఉద్యోగులూ ఆయననే సీఎంగా చూస్తున్నారు. ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి గురించే. ఏపీ ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రి జగన్‌కు ఉన్న యాభై మందికిపైగా సలహాదారుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. మిగతా సలహాదారులెవరూ తెర ముందు కనిపించరు కానీ సజ్జల మాత్రం ఠంచన్‌గా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మీడియా సమావేశాలు ఎంత తరచుగా పెడతారో .. ఇప్పుడు తాను అంత తరచుగా పెడుతున్నారు.
జగన్‌కు అవగాహన లేదని చెప్పి ప్రజల్లో చులకన చేస్తారా !?
అన్ని అంశాలపై మాట్లాడుతున్నారు. ఓ ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలనూ ఆయనే చెబుతున్నారు. ఈ అంశంపై చాలా రోజులుగా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రికి అవగాహన లేదన్న విషయం కూడా ఆయనే చెబుతున్నారు. సీపీఎస్ రద్దు విషయంలో చేతులెత్తేయాలని నిర్ణయించుకున్న సజ్జల దానికి తార్కికమైన ముగింపు కోసం ముఖ్యమంత్రిని బకరాను చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే జగన్‌కు అవగాహన లేదని అసువుగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇది ప్రజల్లోఎంత దారుణమైన నెగెటివ్ ఇంప్రెషన్ జగన్ పై తెస్తుందో సజ్జలకు తెలియనిదేం కాదు.కానీ ఆయన అనేశారు.
ప్రతిపక్షంలో ఓకే అన్నవి ఇప్పుడు నో.. అప్పుడు నో అన్నవి ఇప్పుడు ఓకే..! ఈ సలహాలు సజ్జలవేనా ?
ఈ ఒక్కఅంశంలోనే కాదు… జగన్ తీసుకుంటున్న యూటర్న్ నిర్ణయాల్లో సజ్జల సలహాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించడం… అధికారంలోకి రాగానే అవే నిర్ణయాలు తీసుకోవడం రెండున్నరేళ్లుగా జరిగాయి. అదే సమయంలో అమరావతి వంటి విషయాల్లో ప్రతిపక్షంలో ఉండి స్వాగతించి ఇప్పుడు .. వ్యతిరేకించారు. ఇలాంటి యూటర్న్ నిర్ణయాలతో జగన్‌కు ప్రజల్లో మడమ తిప్పుడు ఇమేజ్ వచ్చేసింది. మాట తప్పం.. మడమ తిప్పం అనే ఓ బ్రాండ్‌ను ప్రచారం చేసుకున్ని అన్ని విషయాల్లో వెనక్కి తగ్గితే పోయేది పరువే. ఆ విషయం సజ్జలకు తెలియనిదేమీ కాదు.
జగన్ ఇమేజ్ను ప్లాన్డ్గా డ్యామేజ్ చేస్తున్న సలహాదారు సజ్జల !?
జర్నలిస్టు అయిన సజ్జల సాక్షిలో ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉండేవారు. అక్కడ్నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. వైఎస్ ఉన్నప్పుడు ఆయనకు బదులుగా కేవీపీ ఎలా చక్రం తిప్పేవారో.. ఇప్పుడు సజ్జలది ఆ పాత్ర. కానీ కేవీపీ ఎప్పుడూ తెర ముందుకు రావాలనుకోలేదు. కానీ సజ్జల తెర ముందుకు వస్తున్నారు. జగన్ ఇమేజ్ను దారుణంగా దెబ్బతీస్తున్నారు. సీఎం తరపున ప్రకటనలు చేసి ఆయనను బకరాను చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారో వైసీపీ నేతలకూ అర్థం కావడంలేదు.