‘మహానటి’ అంటే కీర్తి సురేష్.. కీర్తి సురేష్ అంటే ‘మహానటి’ అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ సినిమా చూసొచ్చాక… అందరూ మాట్లాడుకునేది ఆమె గురించే. నిజానికి ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టేశారు. కానీ క్రెడిట్ మాత్రం కీర్తి సురేష్ కొట్టుకెళ్లిపోయింది. దానికి తగ్గట్టు దర్శక నిర్మాతలు, మీడియా కీర్తిని కీర్తించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ విషయం సమంతకు మింగుడు పడడం లేదేమో.. ‘మహానటి’ టీమ్‌పై అలక చూపిస్తోంది. సమంత చేసిన మధురవాణి పాత్ర ఈ సినిమాకి మూలం. తను కూడా చాలా బాగా నటించింది. క్లైమాక్స్‌లో ‘సోలో’గా చించేసింది. ఈ సినిమా ప్రచారం అంతా ‘సమంత’ చుట్టూ తిరిగింది. కానీ సినిమా విడుదలైంతరవాత… సమంత గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. దాంతో సమంత అలిగినట్టు అనిపిస్తోంది.
గత కొద్ది రోజులుగా ‘మహానటి’ టీమ్‌కి సమంత టచ్‌లో లేదని తెలుస్తోంది. సమంతతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలని మహానటి టీమ్ భావిస్తోంటే సమంత స్పందించడం లేదని టాక్. విడుదలైన రెండు మూడు రోజుల తరవాత దర్శక నిర్మాతలకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయిందని, ఫోన్లు చేసినా సరిగా స్పందించడం లేదని సమాచారం. ఓ స్టార్ హీరోయిన్ ప్రమోషన్లలో పాల్గొంటే ఆ జోరే వేరుగా ఉంటుంది. అది వాళ్ల కనీస బాధ్యత కూడా. ‘రంగస్థలం’ హిట్టయ్యాక కూడా ఆసినిమా ప్రమోషన్లలో విరివిగా పాల్గొంది సమంత. కానీ ‘మహానటి’కి మొండిచేయి చూపించేసింది. ఈ సినిమాకి ప్రత్యేకంగా ప్రచారం అవసరం లేదు కాబట్టి… సమంత ఇంటర్వ్యూ లేకపోయినా లోటు కనిపించకుండా పోయింది.