ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్‌కు మూడు నెలల పాటు పదవీకాలం పొడిగింపు ఇవ్వాలని ఏపీ సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పొడిగింపుపై అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. మరోవైపు నెలాఖరులోపు ఆయన రిటైర్ కావాల్సి ఉంటుంది. హఠాత్తుగా.. ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ .. కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. ఏపీ జీఏడీలో ఆయన రిపోర్ట్ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వలోని అత్యంత కీలకమైన విభాగమైన కార్పొరేట్ ఆఫైర్స్ విభాగాన్ని చూస్తున్న సమీర్ శర్మ హఠాత్తుగా ఏపీకి రావడం సీఎస్ పదవి కోసమేనన్న చర్చ జరుగుతోంది.
అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా డా.సమీర్ శర్మ నియామకం ఖరారైందని ప్రభుత్వ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. కరోనా కాలంలో సీఎస్ లాంటి అధికారులకు పొడిగింపును కేంద్రం ఇస్తోంది.దీంతో.. ఒక రోజు ఆలస్యమైనా ఆదిత్యనాథ్ దాస్‌కు పొడిగింపు లభిస్తుందని భావిస్తున్నారు. ఈ విషయంపై డీవోపీటీ నుంచి ఏపీ సర్కార్కుస్పష్టత వచ్చిందని అంటున్నారు. అయినప్పటికీ.. సమీర్ శర్మను.. .. ఏపీ క్యాడర్‌కు తీసుకు రావడం ఇప్పుడు సంచలనం అవుతోంది. ఆదిత్యనాత్ దాస్‌కు పొడిగింపు ఇచ్చినప్పటికీ.. ఆయనను ఇంటికి పంపేసి… ఆయనకు బదులుగా సమీర్ శర్మకు పదవి ఇస్తారని అంటున్నారు. నిజానికి దాస్ తర్వాత నీరబ్‌కుమార్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు మొదట భావించారు. కానీ నీరబ్ కుమార్ తాము చెప్పినట్లుగా ఉంటారో లేదోనన్న సందేహం ప్రభుత్వ పెద్దలకు ఉందని అంటున్నారు.
అందుకే అనూహ్యంగా సమీర్ శర్మను సీఎస్ గా నియామకం చేయనున్నట్లు సమాచారం. నిజానికి సమీర్ శర్మ.. ఆదిత్యనాథ్ దాస్ కంటే రెండేళ్లు సీనియర్. కానీ వయసులో ఐదు నెలలుచిన్న. అందుకే.. ఆయన రిటైర్మెంట్ టైం ఇంకా ఐదు నెలలు ఉంది. ఇప్పుడు సీఎస్‌గా పదవి ఇచ్చినా ఐదు నెలలుమాత్రమే ఉంటారు. అయితే సివిల్ సర్వీస్ అధికారులకు సీఎస్‌గా రిటైర్మెంట్ అవడం లక్ష్యం కాబట్టి.. ఆయన ఆసక్తి చూపించి ఉంటారని అంటున్నారు. ఆదిత్యనాథ్ దాస్‌కు అన్ని వైపుల నుంచి షాకులు తగులుతున్నాయని అంటున్నారు.