అర్జున్ – విశ్వక్సేన్ కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సింది. కానీ… ఆగిపోయింది. ఈ సినిమా నుంచి విశ్వక్ బయటకు వచ్చేశాడు. కారణాలేమైనా… ఇప్పుడు అర్జున్ మరో హీరోని వెదుక్కోవాల్సిందే. ఇప్పుడు అర్జున్ దృష్టి శర్వానంద్‌పై పడినట్టు తెలుస్తోంది. శర్వాకి ఈ కథ బాగా సూటవుతుందని అర్జున్ భావిస్తున్నాడట. త్వరలోనే శర్వానంద్ ని కలిసి, ఈ కథ గురించి చర్చించాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కథ విన్న తరవాత… శర్వా ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడో చూడాలి.
కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకొన్నాడు శర్వా. శ్రీరామ్ ఆదిత్య కూడా శర్వాకి ఓ కథ వినిపించాడు. ఇది కాకుండా మరో సినిమా కూడా ఒప్పుకొన్నాడు. ఈ మూడింటి మధ్య అర్జున్ కథకు శర్వా ఓకే చేస్తాడా? అనేది అనుమానమే. పైగా… అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తన హీరోపై… ఆరోపణలు చేయడంతో.. యూత్ హీరోలు ఇప్పుడు అర్జున్ తో సినిమా చేయడానికి కాస్త వెనుకంజ వేసే అవకాశం ఉంది. కాకపోతే… అర్జున్ చేతిలో టైమ్ లేదు. నటీనటులకు, టెక్నీషియన్లకు అడ్వాన్సులు ఇచ్చి డేట్లు లాక్ చేసుకొన్నాడు. తను పిలిస్తే వచ్చేసి, కావల్సినన్ని కాల్షీట్లు ఇచ్చే హీరో అర్జున్‌కి కావాలి. మరి.. అలాంటి హీరో ఎవరు దొరుకుతారో చూడాలి.