పవన్ కల్యాణ్‌పై సందర్భం లేకపోయినా అనవసర విమర్శలు చేస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హిడెన్ అజెండా అమలుచేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడాలని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బుధవారం ప్రెస్మీట్లో డిమాండ్ చేశారు. అసలు పవన్ కల్యాణ్ ప్రస్తావన ఎందుకు తెచ్చారో ఎవరికీ అర్తం కాలేదు. సోము వీర్రాజు పవన్‌ను టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గత వారం పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడంపై విమర్శలు గుప్పించారు.
పవన్ కల్యాణ్ ఒక్క స్టీల్ ప్లాంట్ అంశంపైనే మాట్లాడటం సరి కాదని.. ప్రస్తుత..గత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థలగురించి కూడా మాట్లాడాలన్నారు.తాజాగా ఉత్తరాంధ్ర సమస్యలపైనా పవన్ పోరాటం చేయాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రెస్‌మీట్‌లోనే తమకు ఫుల్ టీ కావాలంటూ మిత్రపక్ష రాజకీయాల గురించి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్. అందులో టీ ఉండదు. ఇఏ ఉద్దేశంతో సోము వీర్రాజు ఇప్పుడీ వ్యాఖ్యలు చేశారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
జనసేనను బీజేపీలో విలీనం చేయాలని కోరుకుంటున్నారా లేక పొత్తు పెట్టుకున్నందున బీజేపీ బాధ్యతలు కూడా పవన్ కల్యామఅ తీసుకోవాలని అనుకుంటున్నారా.. అన్నది క్లారిటీ లేని అంశంగా మారింది. మొత్తంగా చూస్తే పవన్ కల్యాణ్‌పై ఇతర బీజేపీ నేతలెవరూ అనుచిత విమర్శలు చేయడం లేదు. ఒక్క సోము వీర్రాజే చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆయన వైసీపీ ఎజెండాను అమలు చేస్తున్నారని బీజేపీలోని ఆయన వ్యతిరేకులు మండిపడుతున్నారు.