మిల్కీ బ్యూటీ తమన్నా ఓ నార్త్ అబ్బాయిని ఇష్టపడ్డదని.. రెండు సంవత్సరాలుగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని.. ఇక వచ్చే ఏడాది తమన్నా అతన్ని పెళ్లి చేసుకోబోతుందని నేషనల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఓ బడా కంప్యూటర్ ఇంజినీర్ కు తమన్నా ఫ్లాట్ అయ్యిందని.. వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని ప్రస్థావించడం జరిగింది. అంతేకాదు వారిద్దరు త్వరలో పెళ్లి రెడీ అయ్యారని.. త్వరలో తమన్నా పెళ్లి బాజాలు మొగడం ఖాయమని చాటింపేస్తున్నారు.
ప్రస్తుతం తమిళ్ లో దర్మదురయ్ సినిమా.. బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ సినిమాల్లో కమిట్ అయిన తమన్నాపై ఇలాంటి న్యూస్ రావడం ఆమె అభిమానులనూ ఆశ్చర్యపడేలా చేస్తుంది. మరి ఈ వార్తలకు తమన్నా స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి. ముంబై మీడియా అత్యంత చొరవ చూపిస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిస్తే మరోసారి నేషనల్ మీడియా పరువు పోయినట్టే.