ఝుమ్మంది నాదంతో ఆకట్టుకొన్న పంజాబీ పడుచు తాప్సి. ఆ సొట్ట బుగ్గల అందాలతో తెలుగులో మంచి అవకాశాలనే అందుకొంది. కానీ.. విజయమే అంది రాలేదు. దాంతో బాలీవుడ్ వెళ్లిపోయింది. ప్రస్తుతా తాప్సి అక్కడ ఫుల్ బిజీ. చేతిలో నాలుగు హిందీ సినిమాలున్నాయి. అమితాబ్‌బచ్చన్ పింక్‌లో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇప్పుడు తాప్సి ప్రేమలో పడిందని కూడా ఓ టాక్ నడుస్తోంది. సాకిబ్ అనే యువ హీరోతో తాప్సి చట్టాపట్టాలేసుకొని తిరుగుతోందట. ”సాకిబ్ చాలా మంచోడు.. తన దగ్గర ఉంటే టైమే తెలియడం లేదు.. తన కంపెనీ నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది” అంటూ తాప్సి ముద్దు ముద్దు గా మాట్లాడుతుంటే.. వీళ్లిద్దరి మధ్యా ఏదో ఉందని రూఢీ అయిపోతున్నారు బాలీవుడ్ జనాలు.
అంతే కాదు…. ఇటీవల తాప్సి పుట్టిన రోజు సందర్భంగా సాకిబ్ ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో తన ప్రేమనంతా కురిపించాడు. దాంతో పాటు ఇద్దరూ ఈ మధ్య గోవా వెళ్లి నాలుగు రోజులు గడిపి వచ్చారట. బర్త్ డే సందర్భంగా డేట్ కి పిలిచాడట. సో.. తాప్సి ప్రేమలో పడిపోయిందన్న పుకార్లకు బలం చేకూరినట్టైంది. ఇదే విషయం తాప్సిని అడిగితే.. ”అతను నా ఫేవరెట్ కో స్టార్. మీరు మాత్రం ఏదైనా రాసుకోండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోంది. ఈ అమ్మాయిలు అస్సలు బయటపడరేం..??