పోలీసులూ.. జాగ్రత్త..? కోడెలపై పెట్టిన ప్రతీ కేసుకూ సమాధానం చెప్పాల్సిందే..! .. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్గా చేసిన వ్యాఖ్యలు అటు పోలీసుల్లో.. ఇటు టీడీపీ క్యాడర్లోనూ కలకలం రేపుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్న ఉదయం నుంచి ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు కేసులని ప్రచారం చేసి… పోలీసులపై… టీడీపీ క్యాడర్ కు ఆగ్రహం పెరిగేలా చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే… నిన్న ఉదయం కోడెల పార్థీవదేహాన్ని తీసుకుని గుంటూరు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. పోలీసులపై అంత తీవ్రంగా వ్యాఖ్యలు చేయలేదు. కానీ… సాయంత్రం గుంటూరులో.. మాత్రం.. పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతీ కేసు వివరాన్ని వెల్లడించి.. ఇలాంటి కేసులతో.. కోడెలను వేధిస్తారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు చెప్పిన వివరాల ప్రకారం… పోలీసులు .. కోడెల శివప్రసాదరావు పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చని.. టీడీపీ నేతలు… అంటున్నారు. మూడు నెలల కాలంలో పందొమ్మిది కేసులు.. ఇందులో ఒక్కటంటే.. ఒక్క దానికి ప్రాధమిక సాక్ష్యాలు లేవనేది… చంద్రబాబు ఆరోపణ. చివరికి చీటింగ్ కేసుల్లో ఉన్న వాళ్లను… పోలీసులే బెదిరించి… వారితో ఆరోపణలు చేయించి…. కోడెల పరువు తీసేలా సాక్షి పత్రిక ప్రచారం చేయించిందని… చంద్రబాబు ఆరోపించారు. టార్గెట్ కోడెల అంటూ… సాగిన మొత్తం కుట్రలో… పోలీసులదే ప్రధాన పాత్ర అని చంద్రబాబు నమ్ముతున్నారు. చివరికి డీజీపీ కూడా.. పోలీసు వ్యవస్థను.. విజయసాయిరెడ్డి చేతికి ఇచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. చంద్రబాబు వ్యాఖ్యానించడం… కలకలం రేపుతోంది. అదే సమయంలో… కోడెల కుటుంబం అధికారిక లాంఛనాలను తిరస్కరించింది.
కోడెల అంత్యక్రియలు నేడు నర్సరావుపేటలో జరగనున్నాయి. దీని కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరుగా ఎస్పీ స్థాయి అధికారి… భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి కోడెల అభిమానులు వచ్చే అవకాశం ఉంది. అయితే.. సమీప గ్రామాల నుంచి అంత్యక్రియలకు రాకుండా… పోలీసులు ముందస్తుగా… టీడీపీ కార్యకర్తల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 144 సెక్షన్ ఉందని… వస్తే కేసులు పెడతామన్నట్లుగా ఇప్పటికే హెచ్చరికలు వెళ్లాయంటున్నారు. దీనిపైనా టీడీపీ నేతలు మండి పడుతున్నారు. అంత్యక్రియలు ప్రశాంతంగా జరగకుండా.. పోలీసులు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే పోలీసుల నిర్బంధ చర్యలు, అక్రమ కేసులతో.. టీడీపీ నేతలు… రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో… ఆంక్షలు వారిని మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. అదే సమయంలో.. టీడీపీ అధినేత కూడా పోలీసులపైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నింటితో… పల్నాడులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.