వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫామ్-7 దరఖాస్తులు తామే పెట్టించామని అంగీకరించడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికి… 250కిపైగా.. వైసీపీ బూత్ లెవల్ కార్యకర్తలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే తొమ్మిది లక్షలకుపైగా ఇలాంటి ఫేక్ ఫామ్ -7 దరఖాస్తులు వచ్చినట్లు తేలడంతో.. కొన్ని వందల మంది…వైసీపీ నేతలు క్రిమినల్ కేసులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. వారంతా.. తమకేమీ సంబంధం లేదని చెప్పినా.. ఐపీ అడ్రస్‌ల ద్వారా వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది. ఇందులో ఎవరుంటే.. వారు కచ్చితంగా ఇరుక్కుపోవాల్సిందే. మొత్తంగా.. జగన్మోహన్ రెడ్డి 50 లక్షల దొంగ ఓట్లని చెబుతున్నారు కాబట్టి.. ఏపీలోనూ వాళ్లు యాభై లక్షల ఓట్లను తొలగించడానికి స్కెచ్ వేశారని అనుకోవాలి. ఇదే ఇప్పుడు..తెలంగాణ రాజకీయవర్గాల్లోనూ కలకలం రేపుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో… 40 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. మరో 10 లక్షల ఓట్లు కొత్తగా చేర్చారు. అంటే… 30 లక్షల అంతిమంగా పోయాయి.ఇది ఒక్క చోట కాదు.. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో సెలక్టివ్‌గా పోయాయి. ఓట్ల గల్లంతుపై… ఎన్నికల సంఘం సారీ కూడా చెప్పింది. కానీ..ఈ ఓట్లు ఎలా పోయాయో మాత్రం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. సర్వే చేసి తీసేశామని.. ఈసీ కోర్టుకు చెప్పింది. అయితే.. ఈసీ అధికారులై టీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడి ఉందని.. కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. కిరణ్ చంద్ర అనే సాంకేతిక నిపుణుడు… ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించిన సమాచారంలో… సీఈవోపై ఒత్తిడి తెచ్చి మరీ.. సెలక్టివ్‌గా ఓట్లు తీసేశారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే.. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఫామ్-7ల ద్వారా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించడానికి.. వేసిన స్కెచ్ బయటకు రావడం.. జగన్ విజయం కోసం.. టీఆర్ఎస్ నేతలే ఎక్కువ తాపత్రయపడుతూండటం వంటి అంశాలతో తెలంగాణ ప్రతిపక్ష నేతలకు.. బల్బు వెలుగుతోంది. తెలంగాణలో కూడా ఫామ్-7 ల ద్వారానే ఓట్ల తొలగింపు చేశారని.. అనుమానిస్తున్నారు. అందుకే.. అసలు గత ఎన్నికలకు ముందు ఎన్ని ఫామ్-7లు వచ్చాయి..? ఎన్ని ఆమోదించారు..? ఏ ఏ నియోజకవర్గాల్లో ఎన్నెన్ని ఓట్లు తీసేశారో.. లెక్క తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై వారు రేపో..మాపో అధికారికంగా ఈసీని ఆశ్రయించి వివరాలు తీసుకుని.. ఎన్నికలపై కోర్టుకెళ్లాలనే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.