జగన్‌పై హత్యాయత్నం జరిగిందంటూ… వైసీపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఏపీలో అసలు పోలీసులకు ఫిర్యాదులు చేయకుండా… సాక్ష్యాలు దొరకకుండా పకడ్బందీగా వ్యవహరించిన వైసీపీ నేతలు.. కేంద్ర సంస్థల దర్యాప్తు కావాలంటూ.. నేరుగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వద్దకు వెళ్లారు. లోపల చెప్పాల్సిదంతా చెప్పారు. ఎంత చెప్పినా.. రికార్డుల ప్రకారం ఉండాలంటే.. ఓ వినతి పత్రం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఆ వినతి పత్రాన్ని తీసుకొచ్చి మీడియాకు కూడా విడుదల చేశారు. దాన్ని చూసి జర్నలిస్టులు కూడా నోళ్లు నొక్కుకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయిన గాయాన్న నాలుగు సెంటిమీటర్లు, ఐదుసెంటిమీటర్లుకు పెంచేసుకుని… దాడి తీవ్ర చాలా ఎక్కువని చెప్పే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి అర సెంటిమీటర్ గాయం అయిందని.. ఆ మాత్రం దానికి కుట్లేమీ అవసరం లేదని… విశాఖలోని అపోలో డాక్టర్ ప్రాథమిక వైద్యం చేసి పంపించేశారు. ఆ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత… విమానం ఎక్కి.. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత జగన్ ఆస్పత్రిలో జాయినైపోయారు. ఆ ఆస్పత్రిలో జాయినయినప్పుడు కూడా.. గాయం అర సెంటిమీటరే. కానీ ఆ హాస్పిటల్ వైద్యులు ఎం ట్రీట్ మెంట్ చేశారో కానీ.. తొమ్మిది కుట్లేశామని.. ఒకటిన్నర సెంటిమీటర్ గాయం అయిందని.. తర్వాత రిపోర్టులో రాసుకొచ్చారు. దాని ప్రకారం తర్వాత వారు వివరణ కూడా ఇచ్చారు. మెడికల్ ట్రీట్ మెంట్లో భాగంగా.. గాయాన్ని పెంచి కుట్లేశామని చెప్పుకొచ్చారు. అలా చేసినా.. ఒకటిన్నర సెంటిమీటరే. మరి… రాజ్‌నాథ్‌కు ఇచ్చిన వినతి పత్రంలో.. వైసీపీ నేతలు… నాలుగైదు సెంటీ మీటర్ల గాయాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకున్నారో మరి..!?
నిజానికి వైసీపీ నేతల ఇటువంటి తీరు వల్లే ఆ పార్టీకి.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. గాయం ఎంత పెద్దది అన్నది కాదు.. మ్యాటర్.. అసలు దాడి జరిగిందా ..? లేదా..? చేస్తే ఎవరు చేశారు అన్నది పాయింట్. కానీ.. ఈ విషయంపై.. ఫోకస్ తగ్గించి… గాయం చాలా పెద్దదయిందని.. దాడి ఘటన తీవ్రతను పెంచి చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. అసలు లాజిక్ దగ్గరకు వెళ్లడం లేదు. కత్తిని బయటకు తీసుకుపోవడం… రక్తం మరకలు ఉంటే శుభ్రంగా కడికి తీసుకు రావడం… వైసీపీ నేతలు చేసిన మొదటి తప్పు. దాని తర్వాత … రక్తపు మరకులున్న చొక్కాను కూడా జగన్ పోలీసులకు ఇవ్వలేదు. అసలు పోలీసులపై నమ్మకమే లేదన్నారు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోసం.. ఇలా… లేనిపోని అబద్దాలు ప్రచారం చేస్తూ… దొరికిపోతున్నారు.