ఉగ్రవాదుల భయం లేరు. నక్సలైట్ల ఉనికి ఎక్కడో అడవుల్లోనే తగ్గిపోయింది. మరి చంద్రబాబుకు రెట్టింపు భద్రత ఎందుకు కల్పించారు ?. ఒక్కటే కారణం ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లో అధికారం ఉండటమే. ఈ విషయాన్ని చెప్పడానికి రక్షణ రంగంలో నైపుణ్యం సాధించాల్సిన పని లేదు. కొంత మంది గత ఘనకార్యాలు.. దేనికైనా తెగించే తత్వం .. ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూలించాలన్న కాంక్షలు తరచూ నోటి మాటల ద్వారా బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఇంటలిజెన్స్‌కు ఖచ్చితమైన సమాచారం రావడంతోనే చంద్రబాబుకు భద్రత పెంచినట్లుగా తెలుస్తోంది.
చంద్రబాబుకు ముప్పు ఉందని ఆయనకు రక్షణ కల్పిస్తున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భావించింది. ఏపీలో ఆయన భద్రతకు సంబంధించి అనేక సందేహాలు వెల్లువెత్తూండటంతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి, ఆయన ఇంట్లోకి కొంత మంది వైసీపీ నేతలు ఆయుధాలతోచొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడం వంటివి జరగడంతో ఎన్ఎస్జీ అప్రమత్తమయింది. ఏపీ పోలీసులు పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు. అడ్డుకునే శక్తి వారికి లేకుండా పోయింది. ఇదంతా ఓ కుట్ర ప్రకారం జరుగుతోందని.. ఎన్ఎస్జీ నమ్ముతోంది .
ఆయనకు ముప్పు ఉందని స్పష్టమైన సమాచారం వస్తేనే ఇంత భారీ సెక్యూరిటీ ఏర్పాటుచేస్తుంది. ఆయనకు ఉన్న ముప్పుపై స్పష్టమైన సమాచారం వచ్చి ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రెండింతలు భద్రత పెంచారని అంటున్నారు. అయితే ఎలాంటి సమాచారం వచ్చింది.. ఎలాంటి ముప్పు చంద్రబాబుకు ఉందన్నది ఎప్పటికీ బయటకు రాదు. సీక్రెట్ గానే ఉంచుతారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ముప్పు ఎవరి వద్ద నుంచో అందరికీ తెలుసని అంటున్నారు.