జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్పై ఓ మహిళ ఆరోపణలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఆ మహిళతో ఆర్థిక సంబంధాల విషయంలో వచ్చిన వివాదం కారణంగా ఇప్పుడు ఆమె బయటకు వచ్చి వీడియోలు రిలీజ్ చేస్తోందని వివాదాన్ని బట్టి అర్థం అవుతోంది. దీన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు జనసేన పార్టీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు. కానీ వారి ట్రాక్ రికార్డు చూస్తే… మాత్రం ఇలాంటి వారు ఎలా ప్రశ్నిస్తారన్న అభిప్రాయం సామాన్యుల నుంచి రావడం సహజమే.
అంబటి రాంబాబు ఓ మహిళతో ఫోన్ లో చేసిన వేషాల రికార్డులు వెలుగులోకి వచ్చాయి. దానిపై విచారణ చేయిస్తామని చెప్పారు.. అవి ఫేక్ అని. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామన్నారు. వారి ప్రభుత్వమే ఉన్నా.. విచారణ చేయించలేదు. అంటే అవి అంబటి రాంబాబువే. కానీ అలా చేసినందుకు అతనికి మంత్రి పదవి ఇచ్చారు. ఇక గోరంట్ల మాధవ్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆయన ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి. వైసీపీలో అలాంటి నిర్వాకాలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఒక్కరంటే ఒక్కర్నీ ఆ పార్టీ నాయకత్వం మందలించలేదు సరి కదా. ..కనీసం ప్రోత్సహించింది.
అలాంటి పార్టీ నేతలు రాజకీయాలకు సంబంధం లేదని.. ఆర్థికపరమైన విషయాల్లో వివాదం వస్తే.. దాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం జనసేన పార్టీని విమర్శించాలని అనుకోవడం అతకని రాజకీయమే అవుతుంది. తమ పార్టీ నేతలు చేస్తే గొప్ప.. . ఇతర పార్టీ నేతలు చేస్తే మహిళల్ని అవమానించడం అన్న రాజకీయాలు చేస్తే.. ఎప్పటికీ ప్రజలు అంత సీరియస్ గా తీసుకోరు. ఈ విషయం వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు.