తెలంగాణలో టిఆర్ఎస్తో తమకు ఒప్పందం కుదిరిందని 12 అసెంబ్లీ సీట్లు ఒక లోక్సభ సీటు కేటాయిస్తారని టిటిడిపి నేతలు అంటున్నారు. ఈ విషయం వారికి అనుకూలమైందిగా పేరొందిన మీడియాలోనూ వస్తున్నది. అయితే టిఆర్ఎస్ నేతలు మాత్రం అదేమీ లేదని ఖండిస్తున్నారు. టిడిపిని వీలైతే బిజెపిని కూడా ఫినిష్ చేయాలని చూస్తున్న తాము సీట్టు ఇచ్చి మళ్లీ ఎందుకు బతికిస్తామని వారు ఎదురు ప్రశ్నిస్తున్నారు. బాహాటంగా కాకుండా లోపాయికారిగా అవగాహన వుండొచ్చని పరిశీలకులు సందేహిస్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయాల కన్నా వెల్ కమ్ కాంబినేషన్ లెక్కలు, తెలంగాణలో ఆంధ్ర ప్రాంత ఓటర్ల ఓట్లు టిఆర్ఎస్ ముఖ్యంగా చూస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే చంద్రబాబాబు కూడా పొత్తులపై ఇప్పుడే మాట్లాడొద్దు అంటున్నారు తప్ప పూర్తిగా కొట్టిపారేయడం లేదు. పైగా తమకు సీట్లు వదలకపోతే అన్నిచోట్ల పోటీ పెట్టి ఓట్లు చీల్చి టిఆర్ఎస్కు రావలసినవి తగ్గేలా చేస్తామని కూదా టిటిడిపి నేతలు సూచిస్తున్నారు. వారి మధ్య ఏదో రాజకీయం నడుస్తున్న మాట మాత్రం నిజం. రెండు ప్రభుత్వాలు మంచిగా వుంటే ప్రజలు కూడా ఆదరిస్తారన్నది టిడిపి వాదనగా వుంది. ఆ కోణంలో టిఆర్ఎస్ కూడా సుముఖంగానే వుంటుంది. అయితే మరో ప్రాంతీయ పార్టీ ఉనికి కొనసాగడం ఎప్పటికీ తమకు మంచిది కాదనీ, జాతీయంగా లేని ఆ వరవడిని మేమెందుకు అవకాశమిస్తామని టిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. అయితే ఆంధ్రజ్యోతిలో ఆర్కే రాశారు గనక రెండు పక్షాల అవగాహన నిజమై వుండొచ్చని మరో వాదన. వింత రాజకీయాలంటే ఇంతే మరి!