పాకిస్తాన్‌తో ఆడిన క్రికెట్ మ్యాచ్‌లో ఏ ఒక్కరూ కూడా ఊహించని విధంగా ఇండియా ఓడిపోయింది. ఏ ఒక్కరూ కూడా ఊహించని విధంగా ఫలితాలు వస్తూ ఉండడంతోనే క్రికెట్‌పైనే బోలెడన్ని అనుమానాలు కలుగుతున్న పరిస్థితి. ఛాంపియన్స్ ట్రోఫీలో అలాంటి మ్యాచ్‌లు ఎన్నో. లీగ్ స్థాయిలో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు సభ్యులు అందరూ కూడా మరీ స్కూల్ పిల్లల్లా ఆడేశారు. ఇక ఫైనల్లో భారత క్రికెటర్స్ అదే స్థాయి ఆటతీరు చూపించారు. కాకపోతే అద్భుతంగా ఆడాలనుకుంటున్నాం అన్న కలరింగ్ మాత్రం బాగా ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో సహా మిగతా టీమ్స్ ఆడిన మ్యాచ్‌లలో అలాంటి ఫలితాలే వచ్చాయి. ప్రముఖ మాజీ పాకిస్తాన్ క్రికెటరే మ్యాచ్‌కి ముందే ఫిక్సింగ్ జరిగిందని చెప్పాక అలాంటి విషయాలు మాట్లాడుకోవడం అనవసరం. కానీ కొంతమంది క్రికెట్టాభిమానులు ‘క్రికెట్లో ఓడిపోతేనేం…బోర్డర్లో గెలుస్తూ ఉన్నాం’ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ ఉండడం మాత్రం బాధాకరం.
మాజీ ఇండియన్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కాశ్మీర్ అంశాన్ని, క్రికెట్లో గెలుపుని పోలస్తూ కామెంట్ చేయడమే తప్పు. ఇక అభిమానులు బోర్డర్లో సైనికుల పోరాటంతో క్రికెటర్ల ఆటను పోల్చడం మరీ దారుణం. మీడియా వాళ్ళు కూడా యుద్ధం అంటూ తోచిన పదాలు వాడేస్తూ ఆ పదాల ప్రాముఖ్యతను తగ్గించేస్తున్నారు. ఈ రోజు ఉన్న ‘పైసా వసూల్’ క్రికెట్‌ని ఏ స్థాయిలో అభిమానిస్తారో….ఆ అభిమానాన్ని పీక్స్‌కి తీసుకెళ్ళడానికి ఏ స్థాయిలో ప్రచారం చేయిస్తారో వాళ్ళిష్టం. కానీ క్రికెటర్ల ఆటను, బోర్డర్లో సైనికుల పోరాటలను పోల్చుతూ కామెంట్స్ చేయడం మాత్రం భావ్యం కాదు. అసలు ఆ కోణంలో ఆలోచింపచేసేలా ఎవరు ఏం రాసినా కూడా చాలా పెద్ద తప్పే అవుతుంది.