రాజకీయంగా డైనమిక్ నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం జగన్ ముందుంటారు. చట్టాలు.. రాజ్యాంగాలు ఆయనకు పట్టవు. తాను సీఎం కాబట్టి ఏమైనా చేయవచ్చనుకుంటారు. ఇప్పుడు మూడు రాజధానులు కూడా అంతే. మూడు రాజధానులు చేయనివ్వడం లేదని.. మూడు రాజధానులు చేస్తే ఏపీ అమెరికా అవుతుందని చెబుతూ ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఇదే అంశంపై వెంటనే ఎన్నికలకు వెళదామని డిమాండ్ చేస్తోంది. దమ్ముంటే రాజధాని అంశమే రిఫరెండంగా ఎన్నికలకు వెళదామని టీడీఎల్పీ సవాల్ చేసింది.
అసెంబ్లీలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తామని దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పాలనపై ప్రజల్లోకి వెళ్లాలా.. లేకపోతే మూడు రాజధానులా అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. మూడు రాజధానుల అంశం మైనస్ అవుతుందన్న ఉద్దేశంతోనే సంక్షేమం పేరుతో గడప గడపకూ ఎమ్మెల్యేలను పంపుతున్నారు. కానీ వ్యతిరేకత కనిపిస్తోంది. ఇప్పుడు మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేసుకోవడం బెటరని జగన్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ ఏడాది అప్పుల పరిమితి ముగిసిపోయింది. వచ్చే నెల నుంచి అప్పుల కోసం తంటాలు పడాలి. చాలాస్కీమ్స్కు డబ్బులు కావాలి. ఈ క్రమంలో వెంటనే ఎన్నికలకు వెళ్లడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆలోచన కూడా వైసీపీలో ఉంది. టీడీపీ కూడా అదే డిమాండ్ చేస్తోంది. జగన్ కు రేపు ఉదయం ఏదనిపిస్తే అది చేసే అవకాశం ఉంది కాబట్టి.. ఏైనా జరగవచ్చన్న అభిప్రాయం ఏర్పడుతోంది.