చిరంజీవి చేస్తున్న మలయాళ రీమేక్ `లూసీఫర్`. మోహన్ రాజా దర్శకుడు. ఈ చిత్రానికి `గాడ్ ఫాదర్` అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి కూడా ఈ టైటిల్ నే ఓకే చేశారు. అధికారిక ప్రకటన రావాల్సివుంది. అయితే… ఈ టైటిల్ సంపత్ నంది దగ్గర ఉంది. `గాడ్ ఫాదర్` పేరుతో సంపత్ నంది ఓ కథ రాసుకున్నాడు. ఈ టైటిల్ కూడా తానే రిజిస్టర్ చేయించుకున్నాడు. అందుకే ఇప్పుడు చిత్రబృందం సంపత్ నందిని సంప్రదించింది. టైటిల్ కోసం.
చిరంజీవి సైతం సంపత్ నందికి కాల్ చేసి టైటిల్ గురించి అడిగినట్టు సమాచారం. చిరు దగ్గర్నుంచి ఫోన్ వచ్చి, టైటిల్ అడిగితే.. సంపత్ నంది కాదంటాడా? పైగా మెగా ఫ్యాన్ ఆయె. అందుకే.. చిరు అడిగిన వెంటనే… సంపత్ నంది తన `గాడ్ ఫాదర్` టైటిల్ ని ఇచ్చేసినట్టు తెలుస్తోంది. సంపత్ నంది నుంచి క్లియరెన్స్ తీసుకున్న తరవాత.. ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించాలని చిత్రబృందం భావించింది. ఇప్పుడు సంపత్ కూడా ఓకే అన్నాడు కాబట్టి… త్వరలోనే ఓ అధికారిక ప్రకటన ఉండొచ్చు.