కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ అనుమానాలు కమ్మేస్తున్నాయి. అందుకే సినిమాలు వాయిదా పడుతున్నాయి. లాక్ డౌన్ అవకాశాలు లేకపోయినా, కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ అనే నిబంధన త్వరలో తెరపైకి వస్తుందన్నది చాలామంది అనుమానం. అందుకే సినిమాలు వాయిదా పడుతున్నాయని అనుకుంటున్నారు. అయితే నిర్మాతల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా.. ఓకే అని, కానీ… పరిస్థితులు మరోలా ఉన్నాయని.. అంటున్నారు.
ఓ అగ్ర నిర్మాత ఈ విషయమై తెలుగు 360తో మాట్లాడారు. ”50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు నడుపుకోవడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. తమ సినిమాని ఓటీటీలో చూసుకోవడం కంటే ఇది చాలా మేలు. సంక్రాంతి సీజన్ లో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నడిచింది. అయినా సరే, మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. జనాలు థియేటర్లకు రావడానికి భయపడుతున్నారు.