పవన్ కల్యాణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, కారు కూడా అమ్మేసుకొన్నాడని ఓ వార్త మొన్నటి వరకూ హల్ చల్ చేసింది. ఇప్పుడు అలాంటి న్యూసే మిత్రుడు త్రివిక్రమ్ విషయంలోనూ వినిపిస్తోంది. త్రివిక్రమ్‌కీ ఆర్థిక సమస్యలున్నాయని, వాటి నుంచి ఎలా బయటపడాలో తెలీక తికమక పడుతున్నాడని టాక్. త్రివిక్రమ్ ఓ ఇల్లు కడుతున్నాడిప్పుడు. అత్యంత అధునాతనమైన సౌకర్యాలతో ఆ ఇల్లు నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకూ రూ.8 కోట్ల వరకూ పెట్టాడట. ఇంటీరియర్ పనులు కూడా చాలా వరకూ జరిగిపోయాయట. అయితే డబ్బుల్లేక.. వాటిని ఆపేశాడట. అయితే త్రివిక్రమ్‌కి ఆర్థిక సమస్యలేంటి?? నాన్సెస్ అనిపిస్తోంది. ఎందుకంటే రైటర్‌గా ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకొన్నది ఆయనే. దర్శకుడిగా ఏం తగ్గలేదు. సినిమాకి పది కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకొంటాడు. అలాంటి త్రివిక్రమ్‌కి ఆర్థిక సమస్యలేంటి???
మొన్నటికి మొన్న అఆ కోసం దాదాపుగా రూ.13 కోట్ల రూపాయల పారితోషికం తీసుకొన్నాడట. అలాంటప్పుడు ఇంటి పనులు పూర్తి చేయడానికి ఆ మాత్రం డబ్బులు ఉండవా?? ఇంటి పనులు ఆగిపోవడానికి కారణం. ఆర్థిక సమస్యలు కావని తెలుస్తోంది. త్రివిక్రమ్ కొత్త ఇంట్లో చిన్న పాటి వాస్తు సమస్యలు వచ్చాయట. వాటిని నివృత్తి చేసుకోవడానికి టైం పడుతుందట. అందుకే.. ఇంటి పని ప్రస్తుతానికి ఆపేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.