సేమ్ టు సేమ్ అని ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం.. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వాలను చూస్తే చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. రాజకీయంగా బీజేపీతో పోరాటం విషయంలో… కేసీఆర్ సుకుంటున్న నిర్ణయాల విషయంలో చంద్రబాబును ఫాలో అవుతున్నారని .. ఆయన ఘోరంగా విఫలమైన అనుభవం ఉన్నా వెనక్కి తగ్గడం లేదని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ప్రభుత్వ పాలన విషయంలోనూ అలాంటి పోలికనే గుర్తు చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కేంద్రం ఎన్ని అవార్డులు ఇచ్చిందో లెక్కలేదు. వందల అవార్డులు వచ్చేవి. గ్రామీణ, పట్టణాభివృద్ధి, ఐటీ ఇలా అనేక విభాగాల్లో ఏపీ ప్రథమంగా ఉండేది. ఇప్పటికీ లోకేష్ నిర్వహించిన శాఖల్లో అప్పటి ఏడాదికి ఇప్పడు అవార్డులు వస్తూ ఉంటాయి. అప్పట్లో బీజేపీలో లొల్లి పెట్టుకున్న తర్వాత టీడీపీ కూడా తమ పరిపాలన ఎంత గొప్పగా ఉందో చూాడాలని చెప్పేవారు. ఆ అవార్డుల్నే సాక్ష్యంగా చూపించేవారు. టీడీపీ నేతలు కూడా ఆ అవార్డులు తమకు ప్రజలు మెచ్చితే వచ్చిన అవార్డులు అనుకునేవారు. కానీ ఎన్నికల్లో పరిస్థితులు తలకిందులయ్యాయి.
ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చెబుతున్నారు. తమకు వచ్చిన అవార్డుల్ని చూపిస్తున్నారు. ప్రజలు తమకు మెచ్చి ఇస్తున్న అవార్డులుగా చెప్పుకుంటున్నారు. కేంద్ర మంత్రులు రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు కానీ… వారే అవార్డులిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ అవార్డులు… ఎక్కడైనా షోగా పెట్టుకోవడానికి పనికి వస్తాయి కానీ ప్రజల మన్ననలు పొందడానికి కాదని గతంలోనే అనుభవపూర్వకంగా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కేటీఆర్ అవార్డుల్ని ఎందుకంత గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారో కానీ దాని వల్ల ప్రజల్లో సానుకూలత వచ్చే అవకాశం లేదని గుర్తించలేకపోతున్నారు. అప్పటి టీడీపీ పరిస్థితిలోనే ఇప్పుడు టీఆర్ఎస్ ఉందని ఇలాంటి ప్రకటనల ద్వారా సెటైర్లు పడుతున్నాయి.