తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక నుంచి భారత రాష్ట్ర సమితి అధినేతగా వ్యవహరించనున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మొదటి లక్ష్యం మునుగోడు ఉపఎన్నిక. రెండు రోజుల్లో మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే.. మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ పేరుతోనే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలస్తోంది. టీఆర్ఎస్ అధ్యక్షునిగానే కేసీఆర్ బీఫాం జారీ చేస్తారు. ఇది చెల్లుతుందా అనే అనుమానం టీఆర్ఎస్ నేతల్లోనే ప్రారంభమయింది.
సమావేశంలో చేసిన తీర్మానం ప్రతులతో ఈ నెల 6న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఢిల్లీకి వెళ్లి సీఈసీకి వాటిని అందజేస్తారు. పార్టీ పేరు మారేదాకా వినోద్ నేతృత్వంలోని టీం ఫాలో అప్ చేస్తుంది. ఇక్కడ పేరు మార్పు మాత్రమే కీలకం. జాతీయ పార్టీగా గుర్తింపు అనేది ఎన్నిక్లలో సాధించే విజయాలను బట్టి ఉంటుంది. ఈసీ అనుకుంటే ఇచ్చేది కాదు. పేరు మార్పు మాత్రం సులభమే. పేరు మారిన తర్వాత టీఆర్ఎస్ ఉనికి ఉండదు. ఉనికిలో లేని పార్టీ పోటీ చేయడం సాధ్యం కాదు.
పేరు మార్పును గుర్తించాలనుకుంటే ఈసీ రాత్రికి రాత్రి గుర్తించవచ్చు. అందుకే.. బీజేపీ ఎదైనా గేమ్ ప్లే చేస్తే మొదటికే మోసం వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండి… టీఆర్ఎస్ గుర్తింపు రద్దయిపోయి..త ఆ ప్లేస్లో బీఆర్ఎస్ అమల్లోకి వస్తే కొన్ని క్లిష్ట సమస్యలు వస్తాయి. అియతే కేసీఆర్ వీటన్నింటినీ ఆలోచించే ఉంటారని చెబుతున్నారు.