బండి సంజయ్ దూకుడు మాటలు టీఆర్ఎస్ నేతలకు కాక పుట్టిస్తున్నాయి. కానీ నోరెత్తవద్దన్న హైకమాండ్ ఆదేశాల మేరకు సైలెంట్ గా ఉంటున్నారు. ఈ మౌనాన్ని ఆసరాగా చేసుకుని బండి సంజయ్ మరింత ఘాటుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని ఆయన అంటున్న మాటలు.. వీర విధేయులకు మండిపోయేలా చేస్తున్నాయి. అరెస్టులు.. జైలు… పొర్లు దండాలు అనడమే కాదు… అంతకు మించి వ్యక్తిగత విమర్శలు ఉంటున్నాయి. దీంతో ఆయనకు కౌంటర్ ఇవ్వకపోతే మరీ అలుసైపోతామని అనుకుంటున్నారేమో కానీ.. రూటు మార్చారు.
భారతీయ జనతా పార్టీని ఏమీ అనకుండానే బండి సంజయ్‌ను అంటున్నట్లుగానే మాటల దాడి ప్రారంభించారు. ముందుగా.. బాల్క సుమన్ ఓపెనింగ్ చేశారు. బండి సంజయ్ పై ఎదురుదాడి ప్రారంభించారు. ఆయన శైలిలోనే తిట్లు లంకించుకున్నారు. ఇక ముందు.. ఇతర టీఆర్ఎస్ నేతలు కూడా అదే పద్దతి పాటించే అవకాశం ఉంది. రాజకీయంగా బీజేపీని విమర్శించడం మానేసినా… అదే అలుసుగా తీసుకుని తమపై బీజేపీ నేతలు.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుండా.. ఇదే వ్యూహం అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
తమ మౌనాన్ని.. బీజేపీ నేతలు… మరో రకంగా తీసుకుని అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని.. దానికి రెస్పాండ్ అవకపోవడం వల్ల ప్రజల్లో కూడా..చులకనయ్యే ప్రమాదాన్ని వ్యక్తిగతంగానే రివర్స్ అవడం ద్వారా తప్పించుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ మాటల దాడికి బీజేపీ రియాక్షన్‌ను బట్టి తదుపరి రాజకీయం ఉండే అవకాశం ఉంది.