రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఓ సంచలనం. టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా… పార్టీలో తిరుగులేని స్థాయిలో ఉన్న రేవంత్.. కేసీఆర్ను ఓడించేందుకు రాజకీయ పునరేకీకరణ అంటూ కాంగ్రెస్లో చేరిపోయారు. వెళ్తూ.. వెళ్తూ.. టీడీపీ వీర విధేయులుగా ఉన్న వారిని కూడా తన వెంట తీసుకెళ్లారు. వారిలో చాలా మంది.. టీడీపీలో ఉంటే రాజకీయభవిష్యత్ ఉండదేమోనన్న భయంతో.. తెలుగుదేశం పార్టీని వీడుతున్నందుకు ఎంతో ఆవేదన చెందారు కూడా. వాళ్లు టీడీపీని వీడి వెళ్లడానికి ప్రధాన కారణం… రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో తమకు రేవంత్ రెడ్డినే అండగా ఉండి.. టిక్కెట్లు ఇప్పిస్తారని వారు ఆశ పడ్డారు. కానీ ఇప్పడేం జరుగుతోంది..? రేవంత్ వర్గానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ లో పాతుకపోయిన పాత బ్యాచ్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతోంది.
రెండు రోజుల పాటు… జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి వర్గం గట్టిగా పట్టుబడుతున్న స్థానాల్లో.. బలమైన అభ్యర్థులుగా మరికొంత మందిని.. ఉత్తమ్ కుమార్ రెడ్డ తెరపైకి తెచ్చారు. ఆ పంచాయతీ ఎప్పటికీ తెలకపోవడంతో… ఆ స్థానాలన్నింటినీ పెండింగ్లో పెట్టారు. ములుగు నియోజకవర్గానికి సంబంధించి ధనసరి అనసూయ అలియాస్ సీతక్కకు మాత్రమే టిక్కెట్ ఖరారయిందని.. మిగతా రేవంత్ అనుచరుల సంగతి.. డొలాయమానంలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. వేం నరేంద్ రెడ్డికి వరంగల్ వెస్ట్, అరికెల నర్సారెడ్డికి నిజామాబాద్ రూరల్, రాజారామ్ యాదవ్ కి ఆర్మూరు, సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి , దేవరకొండ కి బిల్యా నాయక్, ఇల్లందు కి హరరిప్రియ, సూర్యాపేటకు పటేల్ రమేష్ రెడ్డి, చెన్నూరు కి బోడ జనార్దన్ పేర్లను రేవంత్ రెడ్డి గట్టిగా సిఫార్సు చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతానికి అయితే ఆయా పేర్లను పెండింగ్లో పెట్టారు. చివర్లో ఎవరి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో వారికే ఇస్తారు.
కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలను చూస్తే.. తన వర్గానికి టిక్కెట్లు ఇప్పించుకోవడం.. వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం అత్యవసరం. రేపు ఏ పదవికైనా వారి బలమే ప్రధానంగా ఉంటుంది. ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి వర్గం బలం పుంజుకోకుండా.. పరిమితం చేసే రాజకీయాలు .. ఏఐసిసి పెద్దల వద్ద తనకు ఉన్న పరిచయాలతో పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. ఇప్పటికే కోమటి రెడ్డి బ్రదర్స్.. కూడా అసంతృప్తిలో ఉన్నారు. తమ అనుచరుడు చిరమర్తి లింగయ్యకు నకిరేకర్ టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ సీటును తెలంగాణ ఇంటి పార్టీకి ఇస్తున్నట్లు హైకమాండ్ లీకులు ఇచ్చింది.