సినిమా వాళ్ల పెళ్లిళ్లు ఇంతలో జరిగి.. అంతలోనే పెటాకులవుతుంటాయి. విజయ్ – అమలాపాల్ విజయ్ ప్రేమ వ్యవహారం.. ఆ వెంటనే పెళ్లి చేసుకోవడం ఎవ్వరికీ షాక్ ఇవ్వలేదు. అయితే పెళ్లయిన రెండేళ్లకే విడిపోవడం మాత్రం దిగ్భ్రాంతికి కలిగించింది. దానికి కారణం ఏమిటో.. విజయ్ కూడా చెప్పేశాడు. మీడియా రకరకాల వ్యాఖ్యానాలు ఇచ్చే వీల్లేకుండా చేశాడు. అయితే ఇప్పటి వరకూ అమలాపాల్ ఈ విషయంలో స్పందించలేదు. మీడియా ముందుకొచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ట్విట్టర్లోనూ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. విజయ్ ప్రకటన ఇచ్చాక కూడా.. కొంచెం కూడా కదలిక రాలేదు. జరుగుతున్న తతంగం అంతా మౌనంగా చూస్తోంది.
భర్త గురించి గొప్పగా ట్వీట్లు చేసిన అమలాపాల్ ఇప్పుడు ఇంత మౌనంగా ఎందుకు ఉంది? తనపై రకరకాల గాసిప్పులు పుడుతున్నా ఎందుకు స్పందించడం లేదు? ఈ విషయాలపై తమిళనాడులో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అమలాపాల్ మరో వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోందని విజయ్ అభియోగం. ఈ విడాకులకూ కారణం అదే అని తెలుస్తోంది. ఒక వేళ అమల నోరు విప్పితే.. తన నిజాయతీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే విజయ్ దగ్గర మాత్రం అమలాపాల్‌కి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలున్నట్టు సమాచారం. తనకి వ్యతిరేకంగా మాట్లాడితే అందుకు సంబంధించిన సాక్ష్యాల్ని మీడియా ముందు పెడతా.. అని విజయ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట. నాలుగ్గోడల మధ్య ఉన్న వ్యవహారాన్ని ఎందుకు మీడియాకు ఎక్కించాలి? అనుకొని అమలాపాల్ కామ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. బహుశా విడాకులు మంజూరయ్యాక ఆ సాక్ష్యాల్ని విజయ్ స్వయంగా మీడియాకు అందిస్తాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి ఈ భార్యా భర్తలు విడిపోవడం ఖాయం. అయితే… అందుకు గల బలమైన కారణం ఏమిటన్నది ప్రస్తుతానికి వాళ్లకిద్దరికే తెలుసు.