వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత .. గత ప్రభుత్వం చేసుకున్న కరెంట్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. అధిక ధరలకు కొనుగోలు చేశారని.. సీఎం ఆరోపణలు గుప్పించారు. అయితే.. అవినీతి ఆరోపణలకు కానీ… అధిక ధరలకు కొనుగోలు చేశారనే వాదనకు కానీ సరైన ఆధారాలు చూపించలేకపోయారు. ప్రభుత్వం మొదటగా ఈ ఆంశంపై.. ఓ కమిటీ వేసి.. విద్యుత్ కంపెనీల ప్రతినిధులను పిలిపించింది. రేట్లు తగ్గించాలని హెచ్చరించింది. ఆ కంపెనీలు.. ప్రభుత్వం తీరుపై హైకోర్టుకు… పవర్ ట్రిబ్యునల్‌కు వెళ్లాయి. మూడు కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన … పవర్ ట్రిబ్యునల్ పీపీఏలు రద్దు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కడప, అనంతపురం జిల్లాల్లో ఎస్‌బీఈ, ఐన అనంతపురం, స్ప్రంగ్ అనే కంపెనీలు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాయి. వీటితో ఏపీ విద్యుత్ సంస్థలు పీపీఏలు కుదుర్చుకున్నాయి. వీటిని రద్దు చేయడానికి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. కానీ అలాంటి అవకాశమే లేదని ట్రిబ్యునల్ తేల్చింది. రెగ్యులేటరీ అధారిటీకి మరో దారి లేదని ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. విద్యుత్ ధరలపై రెగ్యూలేటరి అథారిటీ చేపట్టాలనుకున్న ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే పీపీఏలను సమీక్షించడంపై హైకోర్టు స్టే ఇచ్చింది.. ఇప్పుడు పవర్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ నేరుగా… పీపీఏల రద్దు చెల్లదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సర్కార్‌కు షాక్ తగిలినట్లయింది.
విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం.. బిడ్డింగ్ ద్వారా డిస్కంలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ కారణంగా రద్దు చేసుకోవడం చట్ట విరుద్ధమని కంపెనీలు వాదించాయి. విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్…. సెక్షన్ 63 ప్రకారమే కాకుండా… గతంలో సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం …విద్యుత్ కొనుగోలు ధరను కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా నిర్ణయించినప్పుడు.. ఆ ధరలను రెగ్యులేటరీ అథారిటీ స్వీకరించాల్సిందేనని… ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో… ఏదో చేద్దామనుకున్న ఏపీ సర్కార్‌కు ఆయాసమే మిగిలినట్లు అయింది.