`రోగ్`తో పూరి జాతకం మారబోతోంది అనుకొన్నవాళ్లంతా నిరాశ పడ్డారు. పూరీ ఏం మారలేదు. అతన్నుంచి వచ్చిన సినిమా ఫలితమూ మారలేదు. కథ, కథనాలపై పూరి దృష్టి పెట్టకపోవడం, ఒరేకరమైన క్యారెక్టరైజేషన్లను నమ్ముకోవడం పూరిలో బలంగా కనిపిస్తున్న బలహీనతలు. దాన్ని దాటుకొని రాలేకపోతున్నాడు పూరి. రోగ్ విషయానికొస్తే.. సెకండాఫ్ బాగా ఇబ్బంది పెట్టింది. తనలోని దర్శకుడూ గుర్రుపెట్టి బొజ్జున్నాడు. దాంతో… పూరిని విమర్శించే వాళ్ల సంఖ్య ఎక్కువైంది. `రోగ్` ఇలా తీస్తే… రేప్పొద్దుట బాలయ్య సినిమా ఏంటన్న భయాలు మొదలైపోయాయి. `రోగ్`తో దర్శకుడిగా పూరి ఫ్లాప్ అయితే… ఒక్కడికి మాత్రం ఈ సినిమా కలిసొచ్చింది.. తనే ఇషాన్.
ఈమధ్యకాలంలో డెబ్యూ సినిమాలోనే ఇంత పెర్‌ఫార్మ్సెన్స్ ఇచ్చిన కథానాయకుడు ఇషానే. ఆఖిరికి అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న అఖిల్ కూడా ఎక్స్ప్రెషన్స్ విషయంలో తేలిపోయాడు. ఇషాన్లో స్టార్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. తన ఈజ్, డైలాగ్ డెలివరీ.. అన్నింటికంటే మించి లుక్స్.. ఇవన్నీ బాగున్నాయి. యాక్షన్ నేపథ్యంలో సాగే ప్రేమకథలకు బాగా సూటవుతాడు. నిర్మాత మనోహర్ కూడా పూరి నుంచి హిట్ సినిమా ఆశించి ఉండకపోవొచ్చు. తన తమ్ముడి టాలెంట్‌కి పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయడానికి ఓ వేదిక కావాలనుకొని ఉంటాడు. దానికి తగ్గట్టుగా పూరి కూడా ఇషాన్‌ని ఓ రేంజ్లో చూపించాడు. రోగ్ తరవాత… పూరిపై నమ్మకాలు తిరోగమన స్థాయిలో వెళ్తే… ఇషాన్‌కి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.